Omicron Andhra Pradesh : ఏపీలోకి ఇలా ఎంటరై.. అలా వెళ్లిపోయిన ఒమిక్రాన్!
ఏపీకి వచ్చిన విదేశీ ప్రయాణికుల్లో.. 15 మంది పాజిటివ్‌గా తేలారు. వీళ్ల శాంపిల్స్‌ను.. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపగా...

Omicron Ap
Omicron Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు బయటపడింది. కానీ.. గుడ్ న్యూస్ ఏమిటంటే.. అతనికి మళ్లీ టెస్ట్ చేస్తే.. నెగటివ్ వచ్చింది. అంటే.. ప్రస్తుతానికి ఏపీలో ఒమిక్రాన్ కేసులు లేనట్టే. ఇక.. తెలంగాణలోనూ ముందు జాగ్రత్త చర్యగా 55 వేల కోవిడ్ బెడ్స్‌ను సిద్ధం చేసింది ఆరోగ్యశాఖ. ఈ రెండింటిని మించిన పాజిటివ్ న్యూస్ మరొకటుంది. మహారాష్ట్రలో ఒమిక్రాన్ సోకిన 17 మందిలో 9 మంది డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లిపోయారు. ఎన్ని టెస్టులు చేసినా.. ఎంత కట్టడి చేసినా.. దేశంలో ఎక్కడో ఓ చోట ఒమిక్రాన్ కేసు బయటపడుతూనే ఉంది. అలా.. ఏపీలోనూ ఎంట్రీ ఇచ్చింది. విజయనగరం జిల్లాలో.. 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కానీ.. ఒమిక్రాన్ ఇలా టెన్షన్ పెట్టి.. అలా వెళ్లిపోయింది.
Read More : Australia : గ్రౌండ్‌లో ప్రేయసికి ప్రపోజల్ చేసిన ఆసీస్ మహిళ
అసలేం జరిగింది :-
అసలేం జరిగిందంటే.. ఇటీవలే అతను ఐర్లాండ్ నుంచి ముంబైకి వచ్చాడు. అక్కడి ఎయిర్‌పోర్టులో చేసిన ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లో.. నెగటివ్‌గా తేలడంతో గత నెల 27న విశాఖకు వచ్చాడు. విజయనగరంలో మళ్లీ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అతని శాంపిల్స్‌ని.. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపగా.. ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అయితే.. అతనికెలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. దీంతో.. శనివారం రోజు మళ్లీ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేశారు. అందులో.. నెగటివ్‌గా తేలింది.
Read More : Himachal Pradesh : మేరా ఫౌజీ అమర్ రహే, పెళ్లి చీర ధరించి…భర్తకు కన్నీటి వీడ్కోలు
ఏపీకి వచ్చిన విదేశీ ప్రయాణికుల్లో.. 15 మంది పాజిటివ్‌గా తేలారు. వీళ్ల శాంపిల్స్‌ను.. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపగా 10 కేసులకు సంబంధించిన రిపోర్టులు వచ్చాయి. ఇందులో.. ఒకరికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అతనికి.. మళ్లీ టెస్ట్ చేస్తే నెగటివ్ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతానికి ఒమిక్రాన్ కేసులు లేవని.. వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ప్రజలు ఆందోళన చెందొద్దని.. ఫేక్ న్యూస్ నమ్మొద్దని సూచించింది. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్పింది.