TTD : ఈ నెల 7న తిరుమల వీఐపీ దర్శనం రద్దు

అక్టోబర్ 7వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.

TTD : ఈ నెల 7న తిరుమల వీఐపీ దర్శనం రద్దు

Ttd

TTD : అక్టోబర్ 7వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ కారణంగా అక్టోబర్ 5వ తేదీన కూడా వీఐపీ బ్రేక్ దర్శనం నిలివేశారు. ఇక 7వతేది కూడా వీఐపీ దర్శనం నిలివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అదే రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతుండటంతో వీఐపీ దర్శనం నిలిపివేసినట్లు వెల్లడించారు.

Read More : TTD : ఈ నెల 7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 11న తిరుమలకు సీఎం జగన్

ఈ నెల 6న ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. గురువారం ధ్వజారోహణం కారణంగా ఆలయంలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు జరుగుతాయని, ఈ క్రమంలో బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసినట్లు పేర్కొంది. వీఐపీలు, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.

Read More : Husband Kills Wife : పెళ్లైన 10 ఏళ్లకు భార్యకు కలిగిన కోరిక… కుదరదన్న భర్త…..!