TTD : నకిలీ వెబ్‌‌సైట్, ఆన్‌లైన్ గేమ్ తయారీపై టీటీడీ సీరియస్

టీటీడీ పేరిట ఆన్ లైన్ లో గేమ్, వెబ్ సైట్ ఏర్పాటుపై టీటీడీ విజిలెన్స్ విభాగం తీవ్ర ఆగ్రహంగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా...వెబ్ సైట్, ఆన్ లైన్ గేమ్ రూపొందించినట్లు నిర్ధారించారు.

TTD : నకిలీ వెబ్‌‌సైట్, ఆన్‌లైన్ గేమ్ తయారీపై టీటీడీ సీరియస్

Ttd

Tirupati Bus Driver Game : టీటీడీ పేరిట ఆన్ లైన్ లో గేమ్, వెబ్ సైట్ ఏర్పాటుపై టీటీడీ విజిలెన్స్ విభాగం తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఆన్ లైన్ లో తిరుపతి హిల్ క్లయింబ్ రేసింగ్ గేమ్ & తిరుపతి బస్సు డ్రైవర్ పేరిట..ఆన్ లైన్ లో ఓ గేమ్ తయారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ గేమ్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. శ్రీవారితోనే ఆటలాడుతారా ? అంటూ మండిపడ్డారు. పవిత్రమైన తిరుమల కొండను కూడా యాప్‌ల పేరిట డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్ళలు గుప్పించారు.

Read More : Vijayawada : దసరా వచ్చేస్తోంది..ఇంద్రకీలాద్రికి వెళుతున్నారా, తెలుసుకోవాల్సిన విషయాలు!

దీంతో టీటీడీ విజిలెన్స్ దీనిపై దర్యాప్తు చేయడం ప్రారంభించింది. వీటిని తయారు చేసిన వ్యక్తి వరదాచారి సురేష్…అని గుర్తించారు. అధికారులు విచారణ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా…వెబ్ సైట్, ఆన్ లైన్ గేమ్ రూపొందించినట్లు నిర్ధారించారు. వరదాచారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టీటీడీ సీవీఎస్ఓ గోపినాథ్ జట్టి వెల్లడించారు. గేమ్ లు, అనధికార వెబ్ సైట్లతో టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.

Read More : Tirumala : శ్రీవారి సర్వదర్శనం టికెట్లకు ఫుల్‌ డిమాండ్‌..35 నిమిషాల్లో 2.79 లక్షల టికెట్లు బుక్

అసలు ఏం జరిగింది ?
తిరుమల కొండపై బస్సు ప్రయాణం పేరిట విడుదలైన ఈ యాప్‌ వివాదాస్పదమైంది. తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రయాణం చేసే విధంగా ఈ యాప్‌ను తయారు చేశారు. అలిపిరి గరుడ విగ్రహం నుంచి కొండపైకి.. తిరిగి తిరుపతికి ఘాట్ రోడ్డులో ప్రయాణించేలా గేమ్ డిజైన్ చేశారు. టెక్ మేడ్స్ సంస్థకు చెందిన ఓ వ్యక్తి ఏడాది కాలం పాటు..కష్టపడి గేమ్ రూపొందించినట్లు తెలుస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి వచ్చింది. తిరుమల శ్రీవారి కొండలు, బస్సు ప్రయాణం..వర్చువల్ విధానం ద్వారా లడ్డూలు కొనాలని నిబంధన పెట్టారు. గేమ్ ఆడే వారంతా..బస్సు డ్రైవర్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. గేమ్ ఆడుతున్న సమయంలో బ్యాక్ గ్రౌండ్ లో శ్రీవారి శ్లోకాలు వినిపిస్తుండడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.