Vijayawada : దసరా వచ్చేస్తోంది..ఇంద్రకీలాద్రికి వెళుతున్నారా, తెలుసుకోవాల్సిన విషయాలు!

ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు భారీగా తరలివస్తుంటారు. కానీ..కరోనా కాలం నడుస్తుండడంతో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Vijayawada : దసరా వచ్చేస్తోంది..ఇంద్రకీలాద్రికి వెళుతున్నారా, తెలుసుకోవాల్సిన విషయాలు!

Indra

Indrakeeladri : దసరా పండుగ వచ్చేస్తోంది. నవరాత్రి ఉత్సవాలు సమీప పడుతుండడంతో ఆలయ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా ఏపీ రాష్ట్రంలో ఉన్న ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు భారీగా తరలివస్తుంటారు. కానీ..కరోనా కాలం నడుస్తుండడంతో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. భక్తుల ఎంతమందిని దర్శనానికి అనుతించాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 07వ తేదీ నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Read More : Tirumala : శ్రీవారి సర్వదర్శనం టికెట్లకు ఫుల్‌ డిమాండ్‌..35 నిమిషాల్లో 2.79 లక్షల టికెట్లు బుక్

ఈ క్రమంలో..ఆ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు రోజుకు 10 వేల మందిని మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో 30 వేల మందిని రోజుకు అనుమతించాలని నిర్ణయించారు. ఉచిత దర్శనం స్లాట్ బుకింగ్ లో జోరీ మనీలో లోటుపాట్లను గుర్తించిన అధికారులు..ఈ స్థానంలో ఒక రూపాయి చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ విషయాలను 10tvతో దుర్గగుడి ఈవో భ్రమరాంబ తెలిపారు. ఉత్సవాల్లో భవానీ మాల విరమణకు కొండపైన అనుమతి లేదని, భవానీలను దర్శనానికి మాత్రమే అనుమతిస్తామన్నారు.

Read More : Andhra Pradesh : ఏపీలో 1,246 కరోనా కేసులు.. 10 మంది మృతి

అక్టోబర్ 7 నుంచి 15 వ తేదీ వరకు దసరా ఉత్సవాలకు కోవిడ్ నిబంధనల నడుమ పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అయితే..కరోనా రెండు డోసుల వ్యాక్సిన్లు వేయించుకున్న వారికి మాత్రమే కొండపైకి అనుమతించడం జరుగుతుందని, ఒక వ్యాక్సిన్ వేయించుకున్న వారు రెండో డోస్ వేయించుకోవాలని సూచించడం జరుగుతోందన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని ఈవో స్పష్టం చేశారు. దర్శనానికి వచ్చే భక్తుల అనుమతి విషయంలో…మరోసారి కో ఆర్డినేషన్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు.