Tirumala : శ్రీవారి సర్వదర్శనం టికెట్లకు ఫుల్‌ డిమాండ్‌..35 నిమిషాల్లో 2.79 లక్షల టికెట్లు బుక్

టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డ్ నమోదైంది.. కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి సర్వదర్శనం టికెట్లు రికార్డ్ సమయంలో బుక్ అయిపోయాయు. 35 నిమిషాల్లో స‌ర్వద‌ర్శనం టికెట్లు ఖాళీ అయ్యాయి.

Tirumala : శ్రీవారి సర్వదర్శనం టికెట్లకు ఫుల్‌ డిమాండ్‌..35 నిమిషాల్లో 2.79 లక్షల టికెట్లు బుక్

Tirumala (2)

Srivari Sarvadarshanam tickets : టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డ్ నమోదైంది.. కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి సంబంధించిన టికెట్లు రికార్డ్ సమయంలో బుక్ అయిపోయాయు. కేవలం 35 నిమిషాలలో స‌ర్వద‌ర్శనం టికెట్లు ఖాళీ అయిపోయాయి. టీటీడీ ఇవాళ ఉదయం 9 గంటలకు టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. విడుదల చేసిన 35 నిమిషాల్లో 2.79 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి.

శ్రీవారి సర్వదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు ఇవ్వడం ప్రారంభించింది. అక్టోబ‌రు 31 వ‌ర‌కు స‌ర్వద‌ర్శనం టికెట్లను జారీ చేసింది. సర్వదర్శనం టోకెన్లను నేటి నుంచి ఆన్‌లైన్‌లో టోకెన్లు ఇస్తామని టీటీడీ అధికారులు ముందుగానే ప్రకటించారు. దీంతో వర్చువల్ క్యూ పద్ధతిలో వేచి చూసిన భక్తులు.. టికెట్లు అలా రిలీజ్‌ కాగానే ఇలా బుక్ చేసేసుకున్నారు.

TTD : జియో చేతికి ‘తిరుమల’ వెబ్‌సైట్

వర్చువల్ క్యూ పద్ధతిలో టికెట్ల కేటాయింపు చేశారు. వర్చువల్ క్యూ ద్వారా ముందుగా వెబ్‌సైట్‌లో లాగిన్ అయినవారికే అవకాశం కల్పించారు. నెట్ సెంటర్ల వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా గుమిగూడారు. వర్చువల్ క్యూ పద్ధతి పాటించడంతో సర్వర్ల క్రాష్ సమస్య తప్పింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు టికెట్లు బుక్ చేసుకున్నారు.