TTD : ఈ నెల 7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 11న తిరుమలకు సీఎం జగన్

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈనెల 6న అంకురార్పణ జరగనుండగా.. 7 నుంచి 15 తేదీవరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇక ఇదే అంశంపై శుక్రవారం టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

TTD : ఈ నెల 7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 11న తిరుమలకు సీఎం జగన్

Ttd

TTD : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈనెల 6న అంకురార్పణ జరగనుండగా.. 7 నుంచి 15 తేదీవరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇక ఇదే అంశంపై శుక్రవారం టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల పదకొండున గరుడసేవ జరగనుందని.. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తామని ఈఓ తెలిపారు. ఇక రిలయన్స్ సంస్థల విరాళంతో అభివృద్ధి చేసిన అలిపిరి మెట్ల మార్గాన్ని శ్రీవారి బ్రహ్మోత్సవాలు నుండి భక్తులకు అందుబాటులోకి తెస్తామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి వివరించారు.

సీఎం జగన్ ప్రారంభిచేవి ఇవే
>> అలిపిరి వద్ద కొత్తగా నిర్మించిన గో మందిరంను సీఎం ప్రారంభిస్తారు
>> టీటీడీ బర్డ్ ఆస్పత్రిలో చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన కార్డియాక్ సర్జరీ యూనిట్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు
>> తిరుమలలో నూతనంగా నిర్మించిన బూందీ పోటు రెండవ భవనం, ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు

బ్రహ్మోత్సవాల సమయంలో 8 వేలమంది సర్వదర్శనం భక్తులు, మరో 8వేల మంది ప్రత్యేక దర్శనం భక్తులు, ఇతర ఆర్జిత సేవల భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. 18 ఏళ్లలోపు వారు కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని సూచించారు ఈఓ. ఇక పంచగవ్య ఉత్పత్తుల పనులు మొదలవుతాయని తెలిపారు. వైకుంఠ ఏకాదశి లేదా డిసెంబర్ చివరి నాటికి 15 రకాల పంచగవ్య ఉత్పత్తుల్లో వీలైనన్ని అందుబాటులోకి తీసుకొస్తామని జవహర్ రెడ్డి వివరించారు. ప్రస్తుతం రోజువారీగా 5 వేల అగరబత్తి ప్యాకెట్ లను మాత్రమే తయారు చేస్తున్నామన్నారు. త్వరలో 10 వేల అగరబత్తి ప్యాకెట్ లు తయారు చేసి వాటికి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.