Opinion Poll : అమరావతి కార్పొరేషన్‌పై అభిప్రాయ సేకరణ

అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో కాకుండా 19 గ్రామాలను మాత్రమే కలిపి అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పేరుతో ప్రత్యేక నగరపాలక సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది.

Opinion Poll : అమరావతి కార్పొరేషన్‌పై అభిప్రాయ సేకరణ

Amaravati 11zon 11zon

Amaravati Municipal Corporation : అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు సంబంధించి.. రాజధాని గ్రామాల్లో.. గ్రామసభల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి వారం పాటు.. గ్రామసభలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై.. గ్రామసభల్లో ప్రజలు తెలియజేసే అభిప్రాయాలను, అభ్యంతరాలను.. అధికారులు నమోదు చేసుకోనున్నారు.

ముందుగా.. గ్రామసభలో తీర్మానం చదివి వినిపించి.. దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చిన అభిప్రాయాలను విడివిడిగా నమోదు చేసుకుంటారు. పంచాయతీ ఆఫీసులు, పాల కేంద్రాలు, పాఠశాల ప్రాంగణాల్లో.. గ్రామసభలు నిర్వహించనున్నారు.

Grain Purchase : తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు

అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో కాకుండా.. కేవలం 19 గ్రామ పంచాయతీలను మాత్రమే కలిపి.. అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పేరుతో ప్రత్యేక నగరపాలక సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపైనే.. ఇప్పుడు రచ్చ నడుస్తోంది. రాజధాని గ్రామాల ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు.

19 గ్రామాలతోనే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ జరిపిన 29 గ్రామాలతో కలిపి.. క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనను.. గ్రామసభల్లో అడ్డుకునేందుకు అమరావతి ప్రజలు సిద్ధమయ్యారు.