Ongole : యుక్రెయిన్‌లో చిక్కుకున్న ఒంగోలు విద్యార్థులు.. కన్నీటి పర్యంతమవుతున్న పేరెంట్స్
వీఎన్ కరాజీన్ కార్కివ్ యూనివర్సిటీలో ఇద్దరు విధ్యార్ధులు ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. అక్కడి పరిస్థితుల నేపద్యంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

Ukraine Tension
Ongole Students Trapped In Ukraine : యుక్రెయిన్ రాజధాని ఆక్రమణ దిశగా రష్యా వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే రష్యా బలగాలు కీవ్‌లో ప్రవేశించాయి. కీవ్‌పై వైమానిక దాడులకు రష్యా సిద్ధమైంది. కీవ్ గగనతలంలో రష్యా ఎయిర్‌క్రాఫ్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఏ క్షణమైనా కీవ్‌ను సీజ్ చేసేందుకు రష్యా రెడీగా ఉంది. 96 గంటల్లో కీవ్‌ను రష్యా ఆక్రమించేసుకుంటుదని యుక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అటు యుక్రెయిన్ ఆర్మీ పోరాడుతున్నా రష్యా సైన్యాన్ని ఆపలేకపోతోంది. ఇదిలా ఉంటే…తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అక్కడ చిక్కుకపోయారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. తమ వారిని కాపాడి.. క్షేమంగా స్వస్థలాలకు రప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఒంగోలు సాయిబాబా నగర్ కు చెందిన సంపత్, బలరాంకాలనీకీ చెందిన పుట్టా సాయి లక్ష్మి జశ్వంత్, అద్దంకి నియోకవర్గంలో మరో ముగ్గురు విధ్యార్ధులు యుక్రెయిన్ లో చిక్కుకపోయారు.
Read More : Ukraine Andhra Students : యుక్రెయిన్ లోని ఏపీ విద్యార్ధుల కోసం సీఎం జగన్ కేంద్రానికి ఫోన్
వీఎన్ కరాజీన్ కార్కివ్ యూనివర్సిటీలో ఇద్దరు విధ్యార్ధులు ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. అక్కడి పరిస్థితుల నేపద్యంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. పీఎం మోదీ వెంటనే చొరవ తీసుకుని తమ వారిని సురక్షితంగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఉదయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆందోళన చెందొద్దని, నెట్ వర్క్ ఆగిపోతున్న కారణంగా శనివారం ఉదయం కాల్ చేస్తామంటూ తల్లిదండ్రులకు విద్యార్థులు తెలియచేశారు. నెట్ వర్క్ ఆగిపోవడం…వారి వారి ఫోన్ నెంబర్లు పనిచేయక పోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. యుక్రెయిన్ నుండి వీడియో సందేశాన్ని పంపారు. యుక్రెయిన్ పరిస్థితుల నేపథ్యంలో ఏ క్షణాన ఏమి జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమౌతోంది.
Read More : USA : ‘రష్యాకు మద్దతిస్తే అంతే సంగతులు’.. పాకిస్థాన్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్
మరోవైపు…యుక్రెయిన్‌లో భారత పౌరులను తరలించడంపై విదేశాంగమంత్రి చకాచకా ఏర్పాట్లు చేస్తోంది. యుద్ధం కారణంగా యుక్రెయిన్ ఎయిర్‌స్పేస్‌ను మూసివేయడంతో అక్కడి భారతీయులందరిని సమీప దేశాల్లోకి తరలించి అక్కడి నుంచి ఇండియా తరలించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి హంగేరిలోని భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది. యుక్రెయిన్‌లోని భారతీయులందరు రోడ్డు మార్గంలో హంగేరి, రొమేనియా సరిహద్దులకు రావాలని సూచించింది.
యుక్రెయిన్‌లోని భారత విదేశాంగశాఖ అధికారుల సాయంతో భారతీయులంతా హంగేరి సరిహద్దులోని హుజూర్ద్, రొమేనియా సరిహద్దులోని చెర్నీవెస్ట్కు చేరుకోవాలని సూచించింది.
Read More : Telangana Government : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం సహాయ చర్యలు
విద్యార్థులంతా బృందాలుగా బయల్దేరాలని.. పాస్‌పోర్టులు, అత్యవసర ఖర్చుల కోసం కొంచెం డబ్బు, కావాల్సిన వస్తువులతో సిద్ధంగా ఉండాలని ప్రకటించింది. అంతేగాకుండా కరోనా డబుల్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ మస్ట్ అని సూచించింది. అంతేగాకుండా తాము ప్రయాణిస్తున్న వాహనాలపై జాతీయ జెండాను మస్ట్‌గా ఉంచాలని సూచించింది భారత ఎంబసీ. యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల వివరాలను ఇప్పటికే సేకరించింది కేంద్రం. యుక్రెయిన్‌లో ప్రస్తుతం 16 వేల మంది భారతీయులు ఉన్నారని అంచనా వేస్తున్నారు అధికారులు. రష్యా దాడులతో భారతీయులకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లు, బాంబ్ షెల్టర్లు, హాస్టల్స్‌ల్లో తలదాచుకుంటున్నారు. అక్కడ ఆహారం, నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.