USA : ‘రష్యాకు మద్దతిస్తే అంతే సంగతులు’.. పాకిస్థాన్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్‌

యుక్రెయిన్‌పై పుతిన్‌ దండయాత్ర తర్వాత అంతర్జాతీయంగా పరిస్థితులు శరవేగంగా మారిపోయాయి. శాంతి స్థాపన సాకుతో యుక్రెయిన్‌లో భారీగా బలగాలను మోహరించిన రష్యా.. ఆక్రమణకు ప్రయత్నిస్తోంది.

USA : ‘రష్యాకు మద్దతిస్తే అంతే సంగతులు’.. పాకిస్థాన్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్‌

Biden Warn

USA Warned Pakistan : ఓవైపు యుద్ధం కారణంగా ప్రజల ప్రాణాలు పోతుంటే.. మీకు అంత ఆనందమేంటి..? రష్యా తీరు పట్ల ప్రపంచదేశాలు ఆగ్రహంగా ఉంటే.. మీరు మాత్రం రష్యాకు వంత పాడుతున్నారా..? ఇంక మీ బుద్ధి మారదా..? యుద్ధ సమయంలో రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తారా..? టైమ్‌ వచ్చినప్పుడు చెబుతాం..! తాట తీస్తాం..! ఏవరైన రష్యాకు వత్తాసు పలికితే అంతే సంగతులు..! తస్మాత్‌ జాగ్రత్త..! నోరు అదుపులో పెట్టుకోండి..! ఇది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పాకిస్థాన్‌ను ఉద్దేశించి చేసిన పరోక్ష వ్యాఖ్యలు..! యుద్ధ సమయంలో రష్యాలో పర్యటించిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు బైడెన్‌ చేసిన ఘాటు హెచ్చరిక ఇది.

యుక్రెయిన్‌పై పుతిన్‌ దండయాత్ర తర్వాత అంతర్జాతీయంగా పరిస్థితులు శరవేగంగా మారిపోయాయి. శాంతి స్థాపన సాకుతో యుక్రెయిన్‌లో భారీగా బలగాలను మోహరించిన రష్యా.. యుక్రెయిన్‌ ఆక్రమించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తోంది. బాంబులు, మిస్సైల్‌తో విరుచుకుపడుతోంది. యుక్రెయిన్‌ రాజధానిని దాదాపు ఆక్రమించేసుకుంది..! ఇలాంటి సమయంలో బాధ్యతగల దేశాలు ఎలా స్పందించాలి..? అయితే శాంతిని కోరుకోవాలి..! లేకపోతే యుద్ధాన్ని అదుపుచేసేందుకు ప్రయత్నించాలి..! అంతే కానీ నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వాగడమేంటి..? ఇమ్రాన్‌ ఖాన్‌ రష్యా పర్యటన వెనుక వ్యూహమేంటి..? ఇది అగ్గికి ఆజ్యం పోసినట్లు కాదా..?

Russian Forces : చివరి దశకు యుక్రెయిన్ ఆక్రమణ.. కీవ్‌లో ప్రవేశించిన రష్యా బలగాలు

యుక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ పాకిస్థాన్‌ వేస్తున్న అడుగులను ప్రపంచ దేశాలు సునిశితంగా గమనిస్తున్నాయి. పాక్ ప్రధాని ఈనెల 23న రష్యా టూర్‌కి వెళ్లారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన మాస్కోలో అడుగుపెట్టడంతో అక్కడి విదేశాంగ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఓవైపు రష్యా యుక్రెయిన్‌పై కయ్యానికి కాలు దువ్వడాన్ని అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇతర దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రష్యా తీరును వ్యతిరేకిస్తూ ఆర్ధిక ఆంక్షలు విధిస్తున్న సమయంలో రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఇమ్రాన్‌ఖాన్‌ రష్యాలో అడుగుపెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండ్రోజుల టూర్‌లో భాగంగా ఇమ్రాన్‌ఖాన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపారు.

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇంధన రంగంలో సహకారాన్ని పెంచే విషయంపై పుతిన్‌, ఇమ్రాన్‌ చర్చించుకున్నట్లుగా సమాచారం. అయితే రెండు దేశాధినేతల భేటీ వెనుక ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధురణ ఉన్నట్లుగా చెబుతున్నప్పటికి యుక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్న సమయంలో ఇమ్రాన్‌ఖాన్‌ మాస్కో వెళ్లడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అప్ఘానిస్తాన్‌ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత అగ్రరాజ్యానికి చెందిన మిలటరీ బేస్‌లను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు పాకిస్థాన్ నిరాకరించింది. అంతే కాదు బైడెన్ అమెరికా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫోన్‌లో మాట్లాడేందుకు కూడా అందుబాటులోకి రాలేదు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.

Joe Biden : ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్యపై జో బైడెన్​ కీలక వ్యాఖ్యలు

ఇక దాదాపు 23 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌ ప్రధాని రష్యాలో అడుగుపెట్టడం ఇదే మొదటి సారి. అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు రష్యాను దూరం పెడుతుంటే పాక్‌ మాత్రం దగ్గరవ్వలన్న ఆలోచనను తప్పుపడుతున్నాయి మిగిలిన దేశాలు. ముఖ్యంగా పాకిస్థాన్‌ వ్యవహారశైలిపై అగ్రరాజ్యం అమెరికా మండిపడుతోంది. యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో పాక్‌ ప్రధాని రష్యా టూర్‌కి వెళ్లడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది అమెరికా. అంతే కాదు ఈ పరిణామాలపై బాధ్యత కలిగిన ప్రతి దేశం రష్యా తీరును ఎండగట్టాలన్న వాదనను అమెరికా గట్టిగా వినిపిస్తోంది. లేకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇస్తోంది.