Srisailam Peaceful : శ్రీశైలంలో అంతా ప్రశాంతం.. యధావిధిగా కొనసాగుతున్న వ్యాపారాలు

శ్రీశైలం ఘర్షణతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. శ్రీశైలం పురవీధుల్లో ప్రశాంతంగా ఉండడంతో షాపు యజమానులు ఊపిరిపీల్చుకున్నారు.

Srisailam Peaceful : శ్రీశైలంలో అంతా ప్రశాంతం.. యధావిధిగా కొనసాగుతున్న వ్యాపారాలు

Srisailam

peaceful weather in Srisailam : కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. శ్రీశైలం మల్లన్న భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీశైలంలో వ్యాపారులు, కనడ భక్తులు శాంతించారు. శ్రీశైలంలో యధావిధిగా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటున్నారు. 500 మందికిపైగా ఏపీ పోలీసులు, బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ పోలీస్ బలగాలు పూర్తి స్థాయిలో పహారా కాస్తున్నారు. 100 మంది కర్ణాటక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీశైలం ఘర్షణతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. శ్రీశైలం పురవీధుల్లో ప్రశాంతంగా ఉండడంతో షాపు యజమానులు ఊపిరిపీల్చుకున్నారు.

కర్నూలు జిల్లా శ్రీశైలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కన్నడిగులు నిన్న అర్థరాత్రి హంగామా సృష్టించారు. జగద్గురు పీఠం సమీపంలోని షాపులపై దాడులకు పాల్పడ్డారు. దుకాణాలకు నిప్పుపెట్టారు. దీంతో పలు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. వాహనాలనూ వదిలిపెట్టలేదు. పలు టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. టీ స్టాల్‌ దగ్గర కన్నడ భక్తుడికి, టీ స్టాల్‌ యజమానికి మధ్య గొడవ జరిగింది. టీ స్టాల్‌ యజమాని కన్నడిగుడిపై దాడి చేయడంతో ఘర్షణ చెలరేగింది.

Srisailam : శ్రీశైలం పుణ్యక్షేత్రంలో తీవ్ర ఉద్రిక్తత

దీంతో కోపోద్రిక్తులైన కన్నడిగులు…షాపు యజమానులపై దౌర్జన్యానికి దిగారు. కర్రలతో చితకబాదారు. అంతేకాదు.. షాపులోని వస్తువులను రోడ్డుపై విసిరేసి నిప్పుపెట్టారు. గాయపడిన కన్నడ భక్తుడిని వైద్యశాలకు తరలించారు. అటుగా వచ్చే భక్తులపైనా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరికి గాయాలవ్వగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి కన్నడిగులు ఇంత బీభత్సం సృష్టిస్తుంటే… సెక్యూరిటీ సిబ్బంది స్పందించలేదు. కనీసం పోలీసులు కూడా చర్యలు తీసుకోలేదు. అల్లర్లను అదుపు చేయలేదు. దీంతో స్థానికులు, భక్తుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

కర్ణాటక భక్తులు 20 షాపులకు పైనే ధ్వంసం చేశారు. అలాగే టూ విలర్స్, ఫోర్ విలర్స్ 40 దాకా ధ్వంసం అయ్యాయి. ఘర్షణ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు ఆత్మకూరు డి ఎస్ పి సృతి రంగంలోకి దిగారు. డిఎస్పి సృతి ఆద్వర్యంలో పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేశారు. నాలుగు గంటలకు పరిస్దితి అదుపులోకి వచ్చింది.
ఘర్షణలో ఎవరి వైఫల్యం అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తగినంత బందోబస్తు లేకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి.

Srisailam Clash : శ్రీశైలం ఘర్షణలో కోటి రూపాయలకుపైగా ఆస్తి నష్టం

శ్రీశైలం ఘటనపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శ్రీశైలానికి వచ్చే కన్నడ భక్తుల సంఖ్యను అంచనా వేయలేకపోయారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జనాభాను బట్టి అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయలేక పోయారా అనే ప్రశ్న వస్తోంది. విధ్వంసాన్ని ఎందుకు నియంత్రించలేక పోయారనే విమర్శలు అధికారులు ఎదుర్కొంటున్నారు.

కర్ణాటక భక్తులు అమ్మవారికి పుట్టింటి నుండి సారే తెచ్చేందుకు భారీగా కర్ణాటక భక్తులు శ్రీశైలం వస్తారని తెలిసి ఎందుకు బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది లక్షలాదిగా వచ్చే భక్తులకు కేవలం 300 మంది మాత్రమే బందోబస్తు ఏర్పాటు చేయడం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Maha Shiva Ratri 2022 : శ్రీశైలం క్షేత్రాన్ని ఏ మాసంలో దర్శిస్తే ఏ ఫలితం కలుగుతుంది

ఏదైనా ఘటన జరిగితే 300 మంది సిబ్బంది నియంత్రించగలమా అన్న ఆలోచన లేకపోవడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వచ్చేసరికి జరిగే నష్టం జరిగిపోయింది. కర్ణాటక నుండి వచ్చే భక్తులను అంచనావేసి బందోబస్తు ఏర్పాటు చేసి ఉంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకునేవి కాదు కదా అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి