Srisailam Clash : శ్రీశైలం ఘర్షణలో కోటి రూపాయలకుపైగా ఆస్తి నష్టం

శ్రీశైలం ఘర్షణలో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఐదు గంటల సేపు ఘర్షణ చోటు చేసుకుంది. కోటికి పైనే ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.

Srisailam Clash : శ్రీశైలం ఘర్షణలో కోటి రూపాయలకుపైగా ఆస్తి నష్టం

Assets Loss

Srisailam clash incident : కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో షాపులపై కన్నడిగుల దాడి ఘటన కలకలం రేపుతోంది. శ్రీశైలం ఘర్షణలో భారీ ఆస్థి నష్టం జరిగింది. ఐదు గంటల సేపు ఘర్షణ చోటు చేసుకుంది. కోటికి పైనే ఆస్థి నష్టం వాటిల్లినట్లు సమాచారం. వివిధ ప్రాంతాలకు చెందిన వారి వాహనాలు భారీగా ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం శ్రీశైలం ఘర్షణ అదుపులోకి వచ్చింది. కర్ణాటక భక్తులతో ఘర్షణ పడ్డ షాప్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాప్ యజమాని షమేల్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శ్రీశైలంలో కన్నడిగులు బీభత్సం సృష్టించారు. నంది సర్కిల్ పాతాళగంగ అన్నదాన మందిరం రోడ్ జగద్గురు పీఠం సమీపాలలో పలు షాపులపై కన్నడిగుల దాడి చేశారు. అర్ధరాత్రి12 నుంచి తెల్లవారు జాము వరకు కన్నడిగులు బీభత్సం చేశారు. ఓ టీ షాపులో వాటర్ బాటిల్ కొనేందుకు వెళ్లిన కన్నడ భక్తుడు, షాపు యజమాని మద్య వాగ్వాదం నెలకొని, ఘర్షణకు దారి తీసింది. వివాదం ముదరడంతో షాపు యజమాని దోసె వేసే చాలకితో కన్నడ భక్తుడి తలపై కొట్టాడు.

Srisailam : శ్రీశైలం పుణ్యక్షేత్రంలో తీవ్ర ఉద్రిక్తత

ఘర్షణ విషయం తెలుసుకున్న కన్నడిగులు ఆ షాపు వద్ద బీభత్సం సృష్టించారు. షాపు యజమానిపై దాడి చేశారు. అంతేకాకుండా మరో 20 షాపులకు పైనే ధ్వంసం చేశారు. కురవ సత్రం సమీపంలో ఓ షాపుకు నిప్పంటించారు. పలు దుఖాణాలకు నిప్పు పెట్టారు. పలు షాపులు, టూవీలర్స్, కార్లపై దాడి చేసి ధ్వంసం చేశారు. టూ విలర్స్, ఫోర్ విలర్స్ మొత్తం కలిపి 40 దాకా ధ్వంసం చేశారు. ఈ ఘర్షణలో భారీ ఆస్థి నష్టం జరిగింది.

షాపు యజమానులపై దౌర్జన్యం చేశారు. షాపు యజమానులపై కన్నడిగులు కర్రలతో చితకబాదారు. షాపులలోని వస్తువులను పగులగొట్టి రోడ్లపై విసిరి నిప్పంటించారు. రోడ్లపై కనిపించిన వారిపై కర్రలతో దాడులు చేశారు. అంతటితో ఆగకుండా భక్తులను సైతం కన్నడిగులు తరిమి కొట్టారు. ఇద్దరికీ గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు. స్దానికులు భక్తులు భయాందోళనలో ఉన్నారు. కర్నాటక కొందరి ముఠా శ్రీశైలాన్ని రణరంగం చేశారు. అర్ధరాత్రిలో చెలరేగిన అల్లర్లను సెక్యూరిటీ, పోలీసులు అదుపు చేయలేకపోయారు. స్థానిక ప్రజలు, భక్తులు, వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు.

Srisailam Tension : శ్రీశైలంలో అర్ధరాత్రి కన్నడిగులు బీభత్సం.. షాపు యజమానులు, భక్తులపై దాడి

గాయపడిన కన్నడ భక్తుడిని చికిత్స కోసం వైద్యశాలకు తరలించారు. ఘర్షణ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి ఆత్మకూరు డి ఎస్ పి సృతి దిగారు. డిఎస్పి సృతి ఆద్వర్యంలో అక్కడ పోలీసులు పికెటింగ్ నిర్వహించి, నాలుగు గంటలకు పరస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.