Srisailam Tension : శ్రీశైలంలో అర్ధరాత్రి కన్నడిగులు బీభత్సం.. షాపు యజమానులు, భక్తులపై దాడి

టీ స్టాల్‌ దగ్గర కన్నడ భక్తుడికి, టీ స్టాల్‌ యజమానికి మధ్య గొడవ జరిగింది. టీ స్టాల్‌ యజమాని కన్నడిగుడిపై దాడి చేయడంతో ఘర్షణ చెలరేగింది.

Srisailam Tension : శ్రీశైలంలో అర్ధరాత్రి కన్నడిగులు బీభత్సం.. షాపు యజమానులు, భక్తులపై దాడి

Srisailam

Karnataka devotees attack : కర్నూలు జిల్లా శ్రీశైలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కన్నడిగులు అర్థరాత్రి హంగామా సృష్టించారు. జగద్గురు పీఠం సమీపంలోని షాపులపై దాడులకు పాల్పడ్డారు. దుకాణాలకు నిప్పుపెట్టారు. దీంతో పలు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. వాహనాలనూ వదిలిపెట్టలేదు. పలు టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.

టీ స్టాల్‌ దగ్గర కన్నడ భక్తుడికి, టీ స్టాల్‌ యజమానికి మధ్య గొడవ జరిగింది. టీ స్టాల్‌ యజమాని కన్నడిగుడిపై దాడి చేయడంతో ఘర్షణ చెలరేగింది. దీంతో కోపోద్రిక్తులైన కన్నడిగులు…షాపు యజమానులపై దౌర్జన్యానికి దిగారు. కర్రలతో చితకబాదారు. అంతేకాదు.. షాపులోని వస్తువులను రోడ్డుపై విసిరేసి నిప్పుపెట్టారు. గాయపడిన కన్నడ భక్తుడిని వైద్యశాలకు తరలించారు.

Srisailam Trust Board : ప్రమాణ స్వీకారం చేసిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు

అటుగా వచ్చే భక్తులపైనా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరికి గాయాలవ్వగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి కన్నడిగులు ఇంత బీభత్సం సృష్టిస్తుంటే… సెక్యూరిటీ సిబ్బంది స్పందించలేదు. కనీసం పోలీసులు కూడా చర్యలు తీసుకోలేదు. అల్లర్లను అదుపు చేయలేదు. దీంతో స్థానికులు, భక్తుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

నంది సర్కిల్ పాతాళగంగ అన్నదాన మందిరం రోడ్ జగద్గురు పీఠం సమీపాలలో పలు షాపులపై కన్నడిగులు బీభత్సం సృష్ఠించారు. రోడ్లపై కనిపించిన వారిపై కర్రలతో దాడులు చేశారు. భక్తులను సైతం కన్నడిగులు తరిమి కొట్టారు. కర్నాటకకు చెందిన కొందరి ముఠా శ్రీశైలాన్నే రణరంగం సృస్టించారు. ఇద్దరికీ గాయాలు, వారిని ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి చెలరేగిన అల్లర్లను సెక్యూరిటీ, పోలీసులు అదుపు చేయలేదు. స్థానిక ప్రజలు, భక్తులు, వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు.

Srisailam Temple: శ్రీశైలం ఆలయానికి వచ్చే భక్తులకు ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు

కర్ణాటక భక్తులు 20 షాపులకు పైనే ధ్వంసం చేశారు. అలాగే టూ విలర్స్, ఫోర్ విలర్స్ 40 దాకా ధ్వంసం అయ్యాయి. ఘర్షణ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు ఆత్మకూరు డి ఎస్ పి సృతి రంగంలోకి దిగారు. డిఎస్పి సృతి ఆద్వర్యంలో పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేశారు. నాలుగు గంటలకు పరిస్దితి అదుపులోకి వచ్చింది.