Pawan Kalyan Janasena : ఏపీలో ఎన్నికల హీట్..‘జనసేన’ కోసం రంగంలోకి దిగిన ‘మెగాసేన’

వైసీపీ గడప.. గడపకూ.. వెళ్లిపోతోంది. టీడీపీ.. ఆల్రెడీ జనంలోకి దిగిపోయింది. బీజేపీ.. ఏదో రకంగా ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇక.. మిగిలింది జనసేన. ఆ సేన కోసం.. మెగా సేన రంగంలోకి దిగింది. స్టేట్‌లో.. రోజురోజుకు పెరుగుతున్న పొలిటికల్ టెంపరేచర్‌ను మరింత పెంచేందుకు.. మెగా అభిమానులు పబ్లిక్‌లోకి రాబోతున్నారు. జనసేనాని వెంట నడిచి.. పవన్‌ని సీఎం చేస్తామంటున్నారు.

Pawan Kalyan Janasena : ఏపీలో ఎన్నికల హీట్..‘జనసేన’ కోసం రంగంలోకి దిగిన ‘మెగాసేన’

Pawan Kalyan Janasena

Pawan Kalyan Janasena :  వైసీపీ గడప.. గడపకూ.. వెళ్లిపోతోంది. టీడీపీ.. ఆల్రెడీ జనంలోకి దిగిపోయింది. బీజేపీ.. ఏదో రకంగా ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇక.. మిగిలింది జనసేన. ఆ సేన కోసం.. మెగా సేన రంగంలోకి దిగింది. స్టేట్‌లో.. రోజురోజుకు పెరుగుతున్న పొలిటికల్ టెంపరేచర్‌ను మరింత పెంచేందుకు.. మెగా అభిమానులు పబ్లిక్‌లోకి రాబోతున్నారు. జనసేనాని వెంట నడిచి.. పవన్‌ని సీఎం చేస్తామంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. అదెలా.. సాధ్యమవుతుందో మాత్రం చెప్పడం లేదు.

ఇదంతా చూస్తుంటే.. ఒకటే అనాలనిపిస్తోంది. ఏపీలో ఎన్నికల రచ్చ ఈసారి మామూలుగా లేదుగా అని. ఇప్పటికే.. తెలుగుదేశం గ్రౌండ్ లెవెల్‌లోకి వెళ్లిపోయింది. మరోవైపు.. అధికార పార్టీ గడప గడపకూ వైసీపీ అంటూ.. జనంలోకి వెళుతోంది. ఇది చాలదన్నట్లు.. మంత్రులతో బస్సు యాత్రలు కూడా చేయిస్తున్నారు జగన్. ఇవన్నీ చూశాక అర్థమైన సీనేమిటంటే.. జనరల్ ఎలక్షన్స్‌కి.. ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే రాజకీయాలు.. వేడెక్కిపోతున్నాయ్. ఈ హీట్‌ను మరింత పెంచుతూ.. మెగా ఫ్యాన్స్ రంగంలోకి దిగుతున్నారు.

ఇప్పటివరకు.. మా హీరో సినిమాను హిట్ చేస్తాం.. బ్లాక్ బస్టర్ చేస్తాం.. బాక్సాఫీస్‌ని షేక్ చేస్తాం.. అనే డైలాగులు మాత్రమే మెగా ఫ్యాన్స్ నుంచి వినిపించేవి. కానీ.. ఈసారి స్వరం.. పొలిటికల్ టోన్‌లోకి మారింది. వచ్చే ఎన్నికల్లో.. జనసేనను అధికారంలోకి తెచ్చేందుకు.. అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. అభిమానులంతా.. పవన్ కల్యాణ్‌తో నడుస్తారని.. అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం ప్రకటించింది.

విజయవాడలోని.. ఓ హోటల్‌లో.. చిరు, పవన్, రాంచరణ్ అభిమానులు.. ఓ మీటింగ్ పెట్టుకున్నారు. అంతా మాట్లాడుకున్నారు. ఓ మాట మీదకొచ్చారు. ఫైనల్‌గా.. వచ్చే ఎన్నికల్లో.. మెగా ఫ్యాన్స్ అంతా పవన్ కల్యాణ్ వెంట నడుస్తారని చెప్పారు. 2024లో.. ఏపీలో పవన్ కల్యాణ్‌ను సీఎం చేయడమే తమ టార్గెట్ అని తెలిపారు. జనసేనను జనంలోకి తీసుకెళ్లేలా.. తమ వంతు కృషి చేస్తామంటున్నారు. మరికొన్ని మీటింగ్‌ల తర్వాత.. మెగా ఫ్యాన్స్ తమ కార్యాచరణ ప్రకటించే చాన్స్ ఉంది.

మెగా అభిమానులకు, నాయకులకు మధ్య అంతరాలు లేవని.. పార్టీ ఆదేశాలను పాటిస్తూ వెళ్తామని.. మెగా ఫ్యాన్స్ అంతా జనసేన కార్యకర్తలుగా పనిచేస్తామని.. మెగా హీరోల మాదిరి.. భారీ డైలాగులే చెబుతున్నారు. గతంలో.. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంపై అనేక కుట్రలు చేశారని.. అయినా.. కుటుంబాలు వదిలి ఆనాడు చిరంజీవి కోసం పనిచేశామంటున్నారు. ఇప్పుడు జనసేనపైనా.. అలాంటి అసత్య ప్రచారమే జరుగుతోందని అభిమానులు.. ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. పవన్‌ని సీఎం చేయడం కోసం.. అంతా సంకల్పంతో పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.

త్వరలోనే.. జనసేన పార్టీ నేత, మెగా బ్రదర్ నాగబాబు.. అభిమానులందరితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే.. నాగబాబు, నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో.. ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా.. మెగా అభిమానులను.. జనసేన నాయకత్వం సమాయత్తం చేస్తోంది.