నేను గాలి జనార్థన్ రెడ్డి కూతుర్ని..హాస్పిటల్లో నర్స్ నన్ను మార్చేసింది : మహిళ హల్ చల్

  • Published By: nagamani ,Published On : October 2, 2020 / 10:25 AM IST
నేను గాలి జనార్థన్ రెడ్డి కూతుర్ని..హాస్పిటల్లో నర్స్ నన్ను మార్చేసింది : మహిళ హల్ చల్

lady fake clim Gali janardhan daughter : మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి పేరు మరోసారి తెరపైకి వచ్చింది.‘‘నేను గాలి జనార్ధన్ రెడ్డి కన్నకూతురుని..జనార్థన్ రెడ్డి భార్య కవలలను ప్రసవించింది..హాస్పిటల్ లో పసిబిడ్డగా ఉన్న తను నర్సు అపహరించి..కొన్ని రోజుల తరువాత వేరే మహిళకు అప్పగించింది‘’అంటూ ర్నూలు జిల్లా, బండి ఆత్మకూరు మండలం కాకనూరులో ఓ యువతి సినిమా రేంజ్ లో హల్‌చల్ చేసింది. గాలి జనార్థన్ రెడ్డి కూతుర్ని అయి ఉండీ తాను సాదాసీదాగా బతకాల్సి వస్తోంది..అంటూ నానా హంగామా చేసిన ఆమెను ఆమెతో పాటు వచ్చిన మరో ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె ఎవరు? ఎందుకు ఇలా మాయచేయటానికి యత్నించింది ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.


కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం కాకనూరులో ఉంటున్న గాలి జనార్దన్ రెడ్డి మామ దేరెడ్డి పరమేశ్వర్ రెడ్డి ఇంటికి సెప్టెంబర్ 25న ఆముగ్గురు వచ్చి నానా హంగామా చేశారు. చక్కగా ఓ సినిమా కథ అల్లి డ్రామాలాడి డబ్బులు గుంజుదామనుకున్న వారిపన్నాగం పోలీసుల అరెస్ట్ తో తెరపడింది.


వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ లోని లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన గంగ అలియాస్ సంగీతారెడ్డి, ఆమె భర్త మహమ్మద్‌ నజీర్‌, వారి డ్రైవర్‌ శ్రీమన్నారాయణమూర్తి, అతని భార్య లక్ష్మి ఓ ముఠాగా ఏర్పడ్డా రు. సెప్టెంబర్ 25న గాలి జనార్ధన్ రెడ్డి మామ పరమేశ్వర్ రెడ్డి ఉండే కాకనూరుకు వెళ్లారు. వారిలో సంగీతారెడ్డి అనే మహిళ తాను 28 సంవత్సరాల క్రితం అనంతపురంలోని ఆసుపత్రిలో గాలి జనార్థన్ రెడ్డి భార్య కవలపిల్లలకు జన్మనిచ్చారని వారిలో ఓ బిడ్డగా ఉన్న తనను హాస్పిటల్ లోని ఓ నర్సు అపహరించి..కొన్ని రోజుల తరువాత వేరే మహిళకు అప్పగించిందని..ఇన్నాళ్లకు నాకు ఈ విషయం తెలిసిందనీ..నేను మీ మనవరాలినేనని అంటూ గాలి మామ దేరెడ్డిని నమ్మించే ప్రయత్నం చేసింది.


కావాలంటే చూడండీ ఈ ఫోటోలు అంటూ దీని కొన్ని మార్ఫింగ్ చేసిన ఫేక్ ఫోటోలను చూపించింది. ఇన్నాళ్లు నేను మీ ఇంటి వ్యక్తిగా కాకుండా ఓ అనామకురాలిగా పెరిగాను…ఇప్పుడు వచ్చి మీ పేరు ప్రతిష్టలను పాడుచేయాలనుకోవట్లేదు..కానీ నేను మీ మనుమరాలినని అంగీకరించండీ..అలాగే నాకు డబ్బులు చాలా అవసరం…రూ. 5 లక్షలు ఇస్తే ఈ విషయం ఎవరికి చెప్పనని సినిమా రేంజ్ లో స్టోరీలు చెప్పేసింది.


ఆమెపై పరమేశ్వర్ రెడ్డి పోలీసులు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. డబ్బుల కోసమే తాను నాటకం ఆడానని నిజం ఒప్పుకుంది. వారి నుంచి 5 సెల్ ఫోన్లు, కారు, మార్ఫింగ్ చేసిన ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె ఎవరు? ఎందుకు ఇలా మాయచేయటానికి యత్నించింది ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.