MPTC, ZPTC Elections : ఏపీలో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో 954 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది.

MPTC, ZPTC Elections : ఏపీలో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్

Ap

AP ZPTC and MPTC Elections : ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. వివిధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు మరణించిన కారణంగా ఆయా స్థానాల్లో ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 954 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

రాష్ట్రంలో 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకే కాకుండా గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోనూ రీ పోల్‌ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు చెప్పారు. మొత్తం 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

TRSLP : కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

వీటిలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 50 ఎంపీటీసీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఎవరూ నామినేషన్ల దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలినచోట్ల పోలింగ్ జరుగుతోంది. జెడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 8,07,640 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈ నెల 18న ఓట్ల లెక్కింపు జరుగనుంది.