Balineni Srinivasa Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై పోస్టుమార్టం నిర్వహిస్తాం: బాలినేని శ్రీనివాస రెడ్డి

2 శాతం ఓట్లున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినంత మాత్రాన వైసీపీ పని అయిపోయినట్లేనా? అలా అయితే, గత నాలుగు సంవత్సరాలుగా జరిగిన స్థానిక ఎన్నికలతోపాటు, ఉపాధ్యాయ, స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.

Balineni Srinivasa Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై పోస్టుమార్టం నిర్వహిస్తాం: బాలినేని శ్రీనివాస రెడ్డి

Balineni Srinivasa Reddy: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై పోస్టుమార్టం నిర్వహిస్తామని చెప్పారు మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బాలినేని ఆదివారం మీడియాతో మాట్లాడారు.

New Delhi: దారుణం.. నడిరోడ్డు మీద యువతిపై దాడి చేసి, కారులోకి తోసిన యువకుడు.. వైరల్ వీడియో

‘‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ సంబరాలు చేసుకుంటోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన మేం సంబరాలు చేసుకోలేదు. 2 శాతం ఓట్లున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినంత మాత్రాన వైసీపీ పని అయిపోయినట్లేనా? అలా అయితే, గత నాలుగు సంవత్సరాలుగా జరిగిన స్థానిక ఎన్నికలతోపాటు, ఉపాధ్యాయ, స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏదేమైనా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై పోస్టుమార్టం నిర్వహిస్తాం. లోపాలను గుర్తించి, సరిచేసుకుని ముందుకు సాగుతాం. గ్రాడ్యుయేట్స్ ఎవరూ వైసీపీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్లు కాదు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో బస్సు ప్రమాదం.. 17 మంది మృతి.. 30 మందికి గాయాలు

ఈ విషయాన్ని టీడీపీ గుర్తు పెట్టుకోవాలి. అన్ని వర్గాలను సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది. మూడు ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ గెలవగానే వైసీపీ పని అయిపోతే.. వైసీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు గెలిచినప్పుడు 23 సీట్లకే పరిమితమైన టీడీపీ దుకాణం మూసుకుని ఉండాలి కదా! పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవనే విషయాన్ని లోకేష్ తెలుసుకోవాలి. గ్రాడ్యుయేట్స్ మాకు ఎందుకు దూరమయ్యారు అనే అంశంపై చర్చించి, లోపాల్ని సరి చేసుకుంటాం’’ అని బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు.