Bangladesh: బంగ్లాదేశ్‌లో బస్సు ప్రమాదం.. 17 మంది మృతి.. 30 మందికి గాయాలు

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందిన ఎమద్ పరిబహన్ బస్సు మాదారిపూర్ ప్రాంతంలోని ఎక్స్‌ప్రెస్ వేపై వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో ఉదయం 07.30 గంటల సమయంలో బస్సు అదుపుతప్పి, పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది మరణించారు. మరో 30 మందికిపైగా గాయపడ్డారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో బస్సు ప్రమాదం.. 17 మంది మృతి.. 30 మందికి గాయాలు

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఘోర బస్పు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు రోడ్డు పక్కనున్న కాలువలోకి చొచ్చుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. 30 మందికిపైగా గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందిన ఎమద్ పరిబహన్ బస్సు మాదారిపూర్ ప్రాంతంలోని ఎక్స్‌ప్రెస్ వేపై వేగంగా వెళ్తోంది.

New Delhi: దారుణం.. నడిరోడ్డు మీద యువతిపై దాడి చేసి, కారులోకి తోసిన యువకుడు.. వైరల్ వీడియో

ఈ క్రమంలో ఉదయం 07.30 గంటల సమయంలో బస్సు అదుపుతప్పి, పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది మరణించారు. మరో 30 మందికిపైగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, రక్షణ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బస్సులోంచి మృతదేహాల్ని, క్షతగాత్రుల్ని వెలికి తీశారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. బాధితుల్ని వారి స్థితినిబట్టి వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

New Delhi: బ్యాగులో మహిళ పుర్రె, శరీర భాగాలు లభ్యం.. మహిళను హత్య చేసి పడేశారా?

డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల లేదా బస్సు లోపాల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. బస్సు టైర్ పేలిపోవడం వల్ల కూడా ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, వాస్తవాలు వెలికితీస్తామని అధికారులు చెప్పారు. మృతులు, క్షతగాత్రుల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బంగ్లాదేశ్‌లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సరైన రోడ్ల నిర్వహణ లేకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.