AP PRC ISSUE: చర్చల్లో ఒకే అని ఇపుడు ఇలా అంటారేంటి: సూర్యనారాయణ

ఉపాధ్యాయ సంఘాలు యూ టర్న్ తీసుకోవడంపై జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP PRC ISSUE: చర్చల్లో ఒకే అని ఇపుడు ఇలా అంటారేంటి: సూర్యనారాయణ

Prc

AP PRC ISSUE: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ విషయంపై సీఎం జగన్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలతో శనివారం చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో చర్చల అనంతరం సమ్మె విరమణ చేస్తున్నట్టు ఉద్యోగసంఘాల స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. అయితే స్టీరింగ్ కమిటీ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు యూ టర్న్ తీసుకున్నాయి. ఉపాధ్యాయుల సమస్యలపై స్టీరింగ్ కమిటీ సభ్యులు పక్షపాత ధోరణితో వ్యవహరించారంటూ ఉపాధ్యాయసంఘాలు మండిపడుతున్నారు. ఫిట్మెంట్ విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణతో మళ్లీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉపాధ్యాయ సంఘాలు ప్రణాళికలు వేసుకుంటున్నారు.

Also read: AP PRC Issue: పీఆర్సీ స్టీరింగ్ కమిటీతో ఏకీభవించని ఉపాధ్యాయ సంఘాలు, రంగంలోకి పోలీసులు

ఈక్రమంలో ఉపాధ్యాయ సంఘాలు యూ టర్న్ తీసుకోవడంపై జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు సూర్యనారాయణ ఆదివారం స్పందించారు. శనివారం రాత్రి తమతో పాటు సీఎం వద్ద చర్చల్లో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు.. అప్పుడు అంతా ఓకే అని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నామని స్టేట్మెంట్లు ఇవ్వడంపై సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఫిట్మెంట్ తప్పించి మిగిలిన అన్ని విషయాలలో మేము అనుకున్నవి సాధించామని సూర్యనారాయణ అన్నారు.

Also read:Red Sanders: చంద్రగిరి పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం పట్టివేత

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ విధంగా చేస్తున్నారని సూర్యనారాయణ అన్నారు. మిగతా ఉద్యోగ సంఘాలపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని.. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. ఏ ఒక్కరి వలనే ఉద్యమం విజయవంతం అయిందనే భావన సరికాదని ఆయన అన్నారు. ఉపాధ్యాయ సంఘాల బాధని మేము అర్థం చేసుకున్నామని సమస్యని ఇంతకంటే జటిలం చేయడం సబబు కాదని సూర్యనారాయణ సూచించారు.

Also read: Telangana Congress: రాజ్యాంగం ఎందుకు మార్చాలో కేసీఆర్ చెప్పాలి: భట్టి విక్రమార్క