AP PRC Issue: పీఆర్సీ స్టీరింగ్ కమిటీతో ఏకీభవించని ఉపాధ్యాయ సంఘాలు, రంగంలోకి పోలీసులు

స్టీరింగ్ కమిటీ నిర్ణయాలను ఉపాధ్యాయలు వ్యతిరేకిస్తుడటం, సొంత కార్యాచరణ వైపు అడుగులు వేస్తుండటంతో ఉపాధ్యాయ నేతలపై పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు.

AP PRC Issue: పీఆర్సీ స్టీరింగ్ కమిటీతో ఏకీభవించని ఉపాధ్యాయ సంఘాలు, రంగంలోకి పోలీసులు

Prc Issue1

AP PRC Issue: ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీపై సీఎం జగన్ శనివారం నాడు.. ఉద్యోగ సంఘాలతో చర్చించిన అనంతరం..వ్యవహారం సద్దుమణిగిందని భావిస్తుండగా.. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం అలక భూనారు. పీఆర్సీ సాధనపై ఏర్పాటైన స్టీరింగ్ కమిటీతో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయసంఘాలు ఏకీభవించడం లేదు. దీంతో ప్రత్యేకంగా పీఆర్సీ కోసం పోరాడేలా.. భవిష్యత్ కార్యాచరణను ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.

Also read: Red Sanders: చంద్రగిరి పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం పట్టివేత

పీఆర్సీ పై ఉపాధ్యాయ సంఘాల భవిష్యత్ కార్యాచరణపై పోలీసులు వాకబు చేస్తున్నారు. ఏపీలో పలుచోట్ల ఉపాధ్యాయ నేతలను.. పోలీస్ స్టేషన్లకు పిలిపించి విచారణ చేస్తున్నట్టు తెలిసింది. ఇదిలాఉంటే.. పీఆర్సీపై ఇటీవల ఉద్యోగసంఘాల ఐక్యవేదిక తలపెట్టిన “ఛలో విజయవాడ” కార్యక్రమం విజయవంతం కావడానికి ఉపాధ్యాయులే కారణమని పోలీస్ ఉన్నతాదికారులు భావిస్తున్నారు. ఒకరోజు ముందుగానే విజయవాడ నగరాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న పోలీసులు, ర్యాలీ సమయానికి అంతమంది ఉద్యోగులు బీఆర్టీఎస్ రోడ్డుకు చేరుకోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగులకు, స్థానిక ఉపాధ్యాయులు, ఉద్యోగులు సహాయంచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయుల తదుపరి కార్యాచరణను తెలుసుకుని వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Also read: Telangana Congress: రాజ్యాంగం ఎందుకు మార్చాల్సి వస్తుందో చెప్పు కేసీఆర్: బట్టి విక్రమార్క

స్టీరింగ్ కమిటీ నిర్ణయాలను ఉపాధ్యాయలు వ్యతిరేకిస్తుడటం, సొంత కార్యాచరణ వైపు అడుగులు వేస్తుండటంతో ఉపాధ్యాయ నేతలపై పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం ప్రభుత్వంతో చర్చలు సఫలం అయ్యాక తిరిగి ఇలా అలక బూనడం ఏంటంటూ అటు పోలీసులు, ఇటు ప్రభుత్వ పెద్దలు ఉపాధ్యాయ సంఘాలను ప్రశ్నిస్తున్నారు.

Also read: Patient Death: కంటి ఆపరేషన్ కోసం వస్తే శవాన్ని అప్పగించిన ఆసుపత్రి