Tirumala: భక్తుల అరచేతిలో తిరుమల మార్గదర్శిని.. ఎక్కడికైనా సులువుగా చేరుకునేలా నూతన ఆవిష్కరణ

భక్తులు బస్టాండ్‭లో దిగి సిఆర్వో, అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇలా ఎక్కడికి వెళ్లాలనుకున్నా టీటీడీ వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచిన క్యూఆర్ కోడ్‭ను తమ మొబైల్‭లో స్కాన్ చేస్తే వారికి విభాగాల వారీగా పేర్లు కనిపిస్తాయి. అందులో తాము ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రాంతం మీద క్లిక్ చేస్తే మ్యాప్ డిస్‭ప్లే అయి నేరుగా అక్కడికి తీసుకుని వెళుతుంది. టీటీడీ ఇంజినీరింగ్, ప్రజా సంబంధాల విభాగాలు తయారు చేసిన ఈ విధానాన్ని ఈవో అభినందించారు

Tirumala: భక్తుల అరచేతిలో తిరుమల మార్గదర్శిని.. ఎక్కడికైనా సులువుగా చేరుకునేలా నూతన ఆవిష్కరణ

QR code based web app for Tirumala devotees

Tirumala: వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఎవరినీ అడగకుండా ఒక చోటి నుంచి మరో చోటికి సులువుగా చేరుకోవచ్చు. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి టీటీడీ ఈ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. టీటీడీ ఈవో ఏ.వీ.ధర్మారెడ్డి మంగళవారం తన కార్యాలయంలో ఈ విధానాన్ని పరిశీలించారు. తిరుమలలో టీటీడీకి సంబంధించిన అతిథి గృహాలు, వసతి సముదాయాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‭లు, లడ్డూ కౌంటర్లు, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాలు.. ఇలా భక్తులకు అవసరమైన సుమారు 40 విభాగాల సమాచారాన్ని టీటీడీ క్యూఆర్ కోడ్‭లో నిక్షిప్తం అయి ఉంటుంది.

భక్తులు బస్టాండ్‭లో దిగి సిఆర్వో, అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇలా ఎక్కడికి వెళ్లాలనుకున్నా టీటీడీ వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచిన క్యూఆర్ కోడ్‭ను తమ మొబైల్‭లో స్కాన్ చేస్తే వారికి విభాగాల వారీగా పేర్లు కనిపిస్తాయి. అందులో తాము ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రాంతం మీద క్లిక్ చేస్తే మ్యాప్ డిస్‭ప్లే అయి నేరుగా అక్కడికి తీసుకుని వెళుతుంది. టీటీడీ ఇంజినీరింగ్, ప్రజా సంబంధాల విభాగాలు తయారు చేసిన ఈ విధానాన్ని ఈవో అభినందించారు. ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. సేవా సదన్ నుంచి వివిధ ప్రాంతాల్లో సేవ చేయడానికి వెళ్ళే శ్రీవారి సేవకులు.. తాము వెళ్ళాల్సిన ప్రాతం కనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారని, బ్రహ్మోత్సవాల్లో ప్రయోగాత్మకంగా శ్రీవారి సేవకుల ద్వారా ఈ విధానం అమలు అమలు చేయాలని పిఆర్వోను ఈవో కోరారు.

Nitish Kumar: యూపీ నుంచి నితీశ్ జాతీయ పోరు.. అంబేద్కర్ నగర్ నుంచి పోటీ?