Anantapur Crime : అనంతలో రోడ్డు ప్రమాదం.. నీటమునిగి వ్యక్తి మృతి

అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బళ్లారికి చెందిన అశ్వర్థ నారాయణ అనే వ్యక్తి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Anantapur Crime : అనంతలో రోడ్డు ప్రమాదం.. నీటమునిగి వ్యక్తి మృతి

Anantapur Crime

Updated On : December 30, 2021 / 10:58 AM IST

Anantapur Crime : అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుంతకల్లు – బళ్లారి రహదారిపై అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం డోనేకల్ వద్ద బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. అయితే ఇక్కడేవి ప్రమాద హెచ్చరికలు లేకపోవడంతో నిర్మాణ పనులు గమనించకుండా కారులో అటుగా వెళ్ళాడు ఓ వ్యక్తి. దీంతో కారు అదుపుతప్పి 30 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి జలసమాధి అయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు 9 గంటలు కష్టపడి కారుతో పాటు మృతదేహాన్ని కూడా వెలికితీశారు.

చదవండి : Anantapur : సరదాగా ఆడాడు.. పబ్ జీ మాయలో తల్లిదండ్రులను మరిచిపోయాడు

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడిది కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన అశ్వర్ధ నారాయణగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కూడా ఈ బ్రిడ్జిపైనే ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది.

చదవండి : Anantapur News: అనంతపురం జిల్లాలో జింకల వేట కలకలం: నలుగురు వేటగాళ్లు అరెస్ట్