సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు

సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై విజయవాడలోని పంచాయతీరాజ్‌ శాఖామంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, ఎపిపిఎస్సీ, పురపాలకశాఖ, వ్యవసాయ, పశుసంవర్థకశాఖ అధికారులు కూడా కార్యక్రమానికి విచ్చేశారు.

ఇందులో ప్రధానాంశాలపై చర్చించారు. సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు ప్రారంభించనున్నారు. వారం రోజుల పాటు వీటి నిర్వహించనున్నారు. పరీక్షలు రాసేందుకు సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

తొలిరోజే సుమారు 4.5 లక్షల మంది వరకు పరీక్షలు రాస్తారు. దాదాపు 3 నుంచి 5 వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కోవిడ్ నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు రాసేలా జాగ్రత్తచర్యలు తీసుకోనున్నారు.

ఎక్కువగా ఖాళీలు వున్న పశు సంవర్థక అసిస్టెంట్ పోస్ట్‌ల భర్తీపై దృష్టి సారించాలి. అత్యంత పారదర్శకంగా పరీక్షల నిర్వహణ వుండాలి. సోమవారం జిల్లా కలెక్టర్‌లతో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫిరెన్స్ జరగనుంది.