Supreme Court : సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏబీ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎస్ ఏబీ వేంకటేశ్వర రావు సస్పెన్షన్ పై జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. AB వేంకటేశ్వర రావు సస్పెన్షన్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది... ...

Supreme Court : సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏబీ సంచలన వ్యాఖ్యలు

Ab

Senior IPS AB Venkateswara Rao : సుప్రీంకోర్టు సస్పెన్షన్ రద్దు చేసిన అనంతరం సీనియర్ IPS AB వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ బావ కళ్లలో ఆనందం చూడడం కోసం ఇదంతా చేశారు ? సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఓడిపోవడానికి కారకులెవరు ? అని సూటిగా ప్రశ్నించారు. ఏ శాడిస్ట్ కోసం, ఏ సైకో కళ్లల్లో ఆనందం కోసం తనను ఎందుకు క్షోభ పెట్టారని నిలదీశారు. క్యాట్ కు వెళ్లిన సమయంలో.. ఓ సీనియర్ న్యాయవాదిని ప్రభుత్వం నియమిస్తూ.. ఇందుకు రూ. 20 లక్షలు చెల్లించిందని తెలిపారు. సుప్రీంకోర్టుకు కేసు చేరినప్పుడు ప్రభుత్వం ఏకంగా న్యాయవాదుల బృందాన్ని నియమించిందని తెలిపారు. అనంతరం కోర్టులో వాదనలు జరిగాయని దీనికి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యాయో తెలియదని.. తనకు కూడా ఖర్చు అయ్యిందని వెల్లడించారు. కోర్టు ఖర్చులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తాను కోరుతానన్నారు. తప్పుడు రిపోర్టు ప్రకారం..ఏమి చదవకుండానే గుడ్డి సంతకాలు పెట్టి 24 గంటల్లో సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిందని ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు విమర్శించారు.

Read More : Supreme Court : IPS AB వేంకటేశ్వర రావు సస్పెన్షన్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

IPS AB వేంకటేశ్వర రావు సస్పెన్షన్ పై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2022, ఏప్రిల్ 22వ తేదీ శుక్రవారం సస్పెన్షన్ రద్దు చేస్తూ సుప్రీం తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సస్పెన్షన్ చట్ట విరుద్ధమని, ఏకపక్షం.. పలు వ్యాఖ్యలు చేస్తూ హైకోర్టు కొట్టివేసిందన్నారు. కానీ.. దీనిపై ప్రభుత్వం SLPని సుప్రీంకోర్టులో దాఖలు చేసినట్లు..తెలిపారు. ఫిబ్రవరి 08వ తేదీ అర్ధరాత్రి తనను సస్పెండ్ చేసిందని విషయం గుర్తు చేశారు. తనపై ఎన్నో అభాండాలు వేశారని, అర్ధరాత్రి కావడంతో విపరీతంగా ప్రచారం జరిగిందన్నారు. ఈ ప్రచారాన్ని కొంతమంది నమ్మారని, ఈ విషయంలో తనను అడగడానికి చాలా మంది ఇబ్బంది పడ్డారన్నారు. తాను 9వ తేదీ ఉదయం ఓ పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగిందని..ఎవరూ ఆందోళన చెందవద్దని..చట్టపరంగా అవకాశాలను పరిశీలిస్తున్నట్లు లేఖలో వెల్లడించడం జరిగిందన్నారు. హైకోర్టును తన అప్పీల్ ను మన్నించి.. కొట్టివేసిందన్నారు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం కూడా దీనిని ధృవీకరించిందని.. అయితే.. ఇదంతా జరగడానికి రెండు సంవత్సరాలు పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు.