TDP leader Buddha Venkanna: సీబీఐ వాళ్లు నాలుగు తగిలిస్తే అసలు విషయాలు బయటకొస్తాయి.. కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ద వెంకన్న సంచలన వ్యాఖ్యలు

వైసీపీలోకూడా కొంతమంది మంచివారు ఉన్నారు. వారంతా కోటంరెడ్డి బాటలో బయటికి రావాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు. లోకేష్ పాదయాత్ర సక్సెస్ అవ్వటంతో ఇన్ని రోజులు గొలుసులతో తాడేపల్లిలో కట్టేసిన పిచ్చి కుక్కల్ని బయటికి వదిలారంటూ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

TDP leader Buddha Venkanna: సీబీఐ వాళ్లు నాలుగు తగిలిస్తే అసలు విషయాలు బయటకొస్తాయి.. కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ద వెంకన్న సంచలన వ్యాఖ్యలు

TDP leader Buddha Venkanna

TDP leader Buddha Venkanna: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ద వెంకన్న వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక అంశాలు కొడాలి నాని‌కి తెలుసని, సీబీఐ అధికారులు కొడాలి నానిని కూడా విచారించాలని డిమాండ్ చేశారు. నానికి సీబీఐ వాళ్ళు నాలుగు తగిలిస్తే వాస్తవాలు బయటికి వస్తాయని అన్నారు. వైయస్ కుటుంబంలో కొడాలి నాని చిచ్చు పెడుతున్నాడని, వైసీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం కొడాలి నాని ప్రయత్నిస్తున్నాంటూ బుద్ద వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Ram Gopal Varma : ఆర్జీవీ ట్వీట్‪పై బుద్దా వెంకన్న ఆగ్రహం..

కమ్మ సామాజిక వర్గం కోటాలో ఎమ్మెల్యే, మంత్రి అయిన నాని, రోజూ ఆ సామాజిక వర్గ నేతలను తిడుతున్నాడని అన్నారు. కొడాలి నాని ఓ ఉల్లిపాయ పకోడీ, వాళ్ల నాన్న పేరు ఎప్పుడూ ఎందుకు చెప్పుకోడని బుద్ద ప్రశ్నించారు. గుడివాడలో హరికృష్ణ పోటీచేస్తే నాని వెన్నుపోటు వలన ఆయనకు నాలుగో స్థానం దక్కిందని బుద్దా వెంకన్న ఆరోపించాడు. టీడీపీలో అధికార మార్పిడి సమయంలో వైస్రాయ్ హోటల్ గేటును పట్టుకునివేలాడింది కొడాలి నాని అని, చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే గతిలేక వైసీపీలో చేరాడని బుద్దా వెంకన్న అన్నారు.

Shooting On TDP Leader : పల్నాడు జిల్లాలో టీడీపీ నేతపై కాల్పులు.. ఇంట్లో నిద్రిస్తుండగా బయటికి పిలిచి..

వైసీపీలోకూడా కొంతమంది మంచివారు ఉన్నారన్నబుద్ద.. వారంతా కోటంరెడ్డి బాటలో బయటికి రావాలని పిలుపునిచ్చారు. కొడాలి నాని వైఖరి దొంగే దొంగ అన్నట్టుందని విమర్శించారు. లోకేష్ పాదయాత్ర సక్సెస్ అవ్వటంతో ఇన్ని రోజులు గొలుసులతో తాడేపల్లిలో కట్టేసిన పిచ్చి కుక్కల్ని బయటికి వదిలారంటూ బుద్ధ వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.