Snake Catchers : పాములతో పరాచకాలా? కాలనాగులతో డేంజరస్ స్టంట్‌లు.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న స్నేక్‌ క్యాచర్లు

పాముల్ని చీమలు పట్టుకున్నంత ఈజీగా పట్టుకుని ఆడించిన వాళ్లు కూడా.. చివరకు ఆ పాముకాటుకే బలవుతున్నారు. ఈమధ్య ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుతున్నాయి.

Snake Catchers : పాములతో పరాచకాలా? కాలనాగులతో డేంజరస్ స్టంట్‌లు.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న స్నేక్‌ క్యాచర్లు

Snake

Snake catchers : కాల నాగుతో కటింగ్స్‌ ఇవ్వడం.. పట్టుకోవడానికి పరుగులు పెట్టించడం.. దాని పడగమీద చేతులు పెట్టి పరాచకాలాడటం.. స్నేక్‌ క్యాచర్స్‌కు ఈ మధ్య స్టైల్‌గా మారింది. మామూలుగానే నాగు పాముకు పాలుపోసి పెంచినా.. సర్రుమంటూ పడగెత్తి పైకిలేస్తుంది. మరి దాంతో గేమ్స్‌ ఆడితే.. సైలెంట్‌గా సైడ్‌ ఎందుకవుతుంది. చూడ్డానికి కామ్‌గా ఉంది కదా అని ఎక్స్‌ట్రాలు చేస్తే.. కస్సుమంటూ కసితీరా కాటేస్తుంది. ఇది తెలిసినా.. యూట్యూబ్‌ వ్యూస్‌.. పబ్లిసిటీ కోసం డేంజరస్‌ స్టంట్స్‌ చేస్తూ.. లైఫ్‌ను రిస్క్‌లో పడేస్తున్నారు.. కొందరు స్నేక్‌ క్యాచర్స్‌. పాముల్ని చీమలు పట్టుకున్నంత ఈజీగా పట్టుకుని ఆడించిన వాళ్లు కూడా.. చివరకు ఆ పాముకాటుకే బలవుతున్నారు. ఈమధ్య ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుతున్నాయి.

పాము పేరెత్తితేనే భయపడేవాళ్లు కొందరైతే.. పాముని పట్టుకుని పడగతో పాములపట్టీ ఆడేవాళ్లు మరికొందరు. అయితే వీడియోల కోసం .. సోషల్‌ మీడియాలో లైక్‌ల కోసం.. ఇలానే ట్రై చేసి వావా సురేశ్‌, భాస్కర్ నాయుడు, సయీద్‌ లాంటి స్నేక్‌ క్యాచర్లు ఆసుపత్రిపాలయ్యారు. చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. ఇప్పుడు కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన ఓ కుర్ర స్నేక్‌ క్యాచర్‌ ఇలానే అత్యుత్సాహం ప్రదర్శించి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న షరీఫ్‌… సమితి సింగారం ప్రాంతంలో బావిలో తాచుపామును పట్టుకున్నాడు.

Telangana : పాములు పట్టే వ్యక్తి పాము కాటుతో మృతి

గంట పాటు ఆ తాచుపాముతో ఆట‌లాడాడు. పామును వదిలేయాలని స్థానికులు చెప్పినా పట్టించుకోలేదు. ఆ సమయంలో అత‌ని చేతిపై పాము కాటువేసింది. పాము కరిచిన వెంటనే షరీఫ్‌ స్నేహితులు ఆస్పత్రికి వెళ్లాల‌ని చెప్పినా అతను విన‌లేదు. ఆ త‌ర్వాత పాముని అడవిలో వదిలి సురక్ష బస్టాండ్ వద్ద పడిపోవడంతో.. అక్కడున్న వారు ఆస్పత్రికి త‌ర‌లించారు. అయితే అత‌ను పాము కాటుతో విషమించి చ‌నిపోయిన‌ట్టు డాక్టర్లు చెప్పారు. పాము కాటు వేసినప్పుడే ఆస్పత్రికి వెళ్లి ఉంటే.. ప్రాణాలతో ఉండేవాడని స్థానికులు అంటున్నారు.

ఈమధ్య కర్ణాటక సిర్సీకి చెందిన సయీద్‌ కోబ్రా ముందు ఎక్స్‌ట్రా చేశాడు. కోబ్రాలతో ఆటలు ఆడుతూ వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెట్టే అలవాటున్న ఇతనికి .. అక్కడ స్నేక్ క్యాచర్‌గా కూడా మంచి పేరుంది. అయితే రీసెంట్‌గా సిర్సిలో మూడు నాగుపాములను ఆడిస్తుండగా ఒక షాకింగ్ ఘటన జరిగింది. మూడు పాములను కెమెరా ముందు పెట్టి… వాటి తోక లాగుతూ పిచ్చి చేష్టలన్నీ చేశాడు. దాని ముందు చేతులు ఊపుతూ, కాళ్లు ఊపుతూ ఓవరాక్షన్ చేశాడు.

Snake : పాము కాటుకుగురైన వెంటనే ఏంచేయాలో తెలుసా?..

అందులో ఒక దానికి బాగా చిరెత్తుకొచ్చింది. పాము ఒక్కసారిగా.. సయీద్ పైకి ఎగిరి కాటు వేసింది. అంతటితో ఆగకుండా అతని ప్యాంటును తన కోరలతో గట్టిగా పట్టుకుంది. అతను ఎంత లాగిన ఆ పాము వదల్లేదు. అప్పటి వరకు పాములతో సరదాగా సాగిన సయాద్‌ స్టంట్‌.. చివరకు అతడ్ని ఆసుపత్రిలో చేరేలా చేసింది. అయితే వెంటనే చికిత్స లభించడంతో ప్రాణాపాయం తప్పింది. లేదంటే వేల పాములను పట్టిన అతనూ పాము కాటుకే బలయ్యేవాడు.

ఇక వావా సురేశ్‌ కూడా పాము కాటుకు గురై చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు. కేరళలో వావా సురేశ్‌.. స్నేక్‌ కింగ్‌గా ఫేమస్‌. పదో తరగతి నుంచే పాముల్ని పట్టడంలో నేర్పు సాధించిన సురేశ్‌.. ఇప్పటివరకు 50వేలకు పైగా పాముల్ని పట్టుకున్నాడు. జనావాసాల్లోకి వచ్చిన వాటిని నేర్పుగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టేవాడు. పదడుగుల పాముని కూడా ఒడిసిపట్టుకోవడంలో ఆయన నేర్పరి. కింగ్‌ కోబ్రా నుంచి రక్త పింజర వరకు దేన్నైనా చాకచక్యంగా పట్టుకోగలడు. అలాంటి వావా సురేశ్‌.. కొట్టాయంలో కోబ్రాకు దొరికిపోయాడు. వెంటనే విషం ప్రభావం చూపడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. దీంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు.

Bhaskar Naidu : 10వేలకు పైగా పాములు పట్టిన అతడు.. కాటుకు గురై ఆసుపత్రిలో..

వేల పాముల వేటలో.. వందలసార్లు సురేశ్‌ను పాములు కాటేశాయి. అన్నిసార్లూ అతను మందులు వేసుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు. గతంలోనూ సురేశ్‌ పాము కాటుకు గురయ్యాడు. డాక్టర్లు అతనికి యాంటీ వీనమ్ ఇంజక్షన్ ఇచ్చినా పనిచేయని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పలు మార్లు యాంటీ వీనమ్ ఇంజక్షన్లను అతను చేయించుకుని ఉండటంతో ఆ ఇంజక్షన్ ఇప్పుడు పనిచేయడం లేదు. అతని శరీరంలోకి ఎక్కిన యాంటీ వీనమ్ ఔషధం, కోబ్రా కాటుతో వెళ్లిన విషాన్ని అదుపు చేయలేకపోయింది.

దీంతో అతను ప్రాణాలతో కొట్టుమిట్టాడాడు. గతంలోనూ రెండు, మూడుసార్లు వెంటిలేటర్‌పై చికిత్స పొంది పునర్జన్మ పొందాడు. పామును దూరం నుంచి చూడు.. పాము కనిపించేలా ఫోటో దిగు. కానీ పాముతో గేమ్స్‌ ఆడాలని చూస్తే.. కాలనాగు కాటేయడానికి అరక్షణం కూడా ఆలోచించదు. సోషల్‌ మీడియా.. వ్యూస్‌ అంటూ పాములవెంట పడితే.. అదే ఇక మీకు ఆఖరి రోజు కావొచ్చు.. బీ కేర్‌ఫుల్‌.