Somu Veerraju: సారాయి వీర్రాజు అని పిలవడంపై సోము సెటైర్లు

తనను సారాయి వీర్రాజు అన్న కామెంట్లపై ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు.

Somu Veerraju: సారాయి వీర్రాజు అని పిలవడంపై సోము సెటైర్లు

Somu Veerraju

Updated On : December 31, 2021 / 1:55 PM IST

Somu Satires: తనను సారాయి వీర్రాజు అన్న కామెంట్లపై ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ప్రజల తరఫున నిలబడతామన్న ఆయన.. 40 రూపాయలకే సన్న బియ్యం ఇస్తామన్నారు. దమ్ముంటే బియ్యం వీర్రాజు అని పిలవండంటూ సవాల్‌ విసిశారు.

కోడి గుడ్ల రేట్ల పెరుగుదలను ప్రస్థావించిన సోము.. మీకు కావాలంటే నాటు గుడ్ల వీర్రాజు అని కూడా పిలవొచ్చంటూ సెటైర్లు వేశారు. నేను లిక్కర్ గురించి పేదవాడిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడానని, ఆరు రూపాయల బాటిల్‌ను రూ. 200కు అమ్మడాన్ని నేను ప్రోత్సహించనని అన్నారు.

నన్ను సారాయి వీర్రాజు అన్నవారు ఏం తాగుతారో నాకూ తెలుసని అన్నారు. నాపై ట్వీట్ చేసిన కేటీఆర్ తండ్రి తెల్లవారుజామునే మూడు గంటల వరకూ ఏం చేస్తారో తెలుసునని అన్నారు. బీజేపీ ఏ విషయాన్నైనా సరైన సమయంలో సందర్భాలోచితంగా మాట్లాడుతోందని అన్నారు వీర్రాజు.

గుంటూరు జిన్నా టవర్ పేరును వైసీపీ మార్చాలని, లేదంటే 2024లో అధికారంలోకి వచ్చాక బీజేపీనే పేరు మారుస్తుందని అన్నారు సోము వీర్రాజు. అలాగే, విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ పేరు కూడా మార్చాలని, గౌతు లచ్చన్న లేదా తెన్నేటి విశ్వనాథం పేర్లను ఆ ఆసుపత్రికి పెట్టాలని అభిప్రాయపడ్డారు.