ఇచ్చినమ్మ వాయినం..ఇంట్లోనే వరలక్ష్మీ వ్రతాలు

  • Published By: madhu ,Published On : July 31, 2020 / 11:18 AM IST
ఇచ్చినమ్మ వాయినం..ఇంట్లోనే వరలక్ష్మీ వ్రతాలు

శ్రావణమాసం వచ్చిందంటే..చాలు..ఏ ఇంట్లో..మార్కెట్ చూసిన సందడే సందడి కనిపిస్తుంది. కానీ ఈసారి అలా కనబడడం లేదు. కళ తప్పింది. మార్కెట్లు బోసి పోయి కనిపిస్తున్నాయి. దిక్కుమాలిన కరోనా..అంటూ తిట్టుకుంటున్నారు. అవును..ఈ రాకాసి వల్ల..పండుగలను కూడ ఘనంగా చేసుకోలేకపోతున్నారు.



శ్రావణ మాసం సందర్భంగా తొలి శుక్రవారం సందర్భంగా మహిళలు నిర్వహించుకొనే వరలక్ష్మీ వ్రతాలను ఇంట్లోనే నిర్వహించుకుంటూ..మమ అనిపించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

శ్రావణ శుక్రవారం..వరలక్ష్మీ వ్రతం మహిళలకు ఎంతో విశిష్టమైంది. ఆలయాలను అత్యంత శోభయానమానంగా తీర్చిదిద్దుతుంటారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆలయాల్లో వ్రతాలు సామూహికంగా ఏర్పాటు చేస్తుంటారు. అమ్మను కొలిచి..మొక్కులు చెల్లించుకుంటుంటారు.



ఇరుగు..పొరుగు వారు..బంధువుల రాకతో ఘనంగా వ్రతాన్ని నిర్వహించుకుని..వాయినాలు ఇస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో అంత సందడి కనిపించడం లేదు. కరోనా వైరస్ కారణంగా..ఆలయాల్లో నిబంధనలు కొనసాగుతున్నాయి. ఫలితంగా..ఆలయాల్లో సామూహికంగా వ్రతాల నిర్వాహణకు నిర్వహకులు, భక్తులు ఆసక్తి చూపలేదు.

తక్కువ సంఖ్యలో కుటుంబసభ్యుల మధ్యే వ్రతాన్ని చేసుకుంటున్నారు. పరిమిత సంఖ్యలో ఆలయాల్లో భక్తులను అనుమతినిస్తున్నారు. మొత్తానికి టీవీలో లైవ్ కార్యక్రమాలను చూస్తూ..వ్రతాన్ని నిర్వహించుకుంటున్నారు.