Sri Krishnadevaraya University Homam: యూనివర్సిటీలో మహా మృత్యుంజయ హోమం రద్దు

అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ (ఎస్కే) యూనివర్సిటీలో రేపు నిర్వహించాలనుకున్న మహా మృత్యుంజయ హోమానికి బ్రేకులు పడ్డాయి. మృత్యుంజయ హోమాన్ని రద్దు చేస్తూ ఎస్కేయూ రిజిస్ట్రార్ లక్ష్మయ్య సర్క్యలర్ విడుదల చేశారు. ఎస్కే యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బందిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్క్యులర్ లో ఆయన పేర్కొన్నారు.

Sri Krishnadevaraya University Homam: యూనివర్సిటీలో మహా మృత్యుంజయ హోమం రద్దు

Sri Krishnadevaraya University Homam

Updated On : February 23, 2023 / 4:04 PM IST

Sri Krishnadevaraya University Homam: అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ (ఎస్కే) యూనివర్సిటీలో రేపు నిర్వహించాలనుకున్న మహా మృత్యుంజయ హోమానికి బ్రేకులు పడ్డాయి. మృత్యుంజయ హోమాన్ని రద్దు చేస్తూ ఎస్కేయూ రిజిస్ట్రార్ లక్ష్మయ్య సర్క్యలర్ విడుదల చేశారు. ఎస్కే యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బందిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్క్యులర్ లో ఆయన పేర్కొన్నారు.

యూనివర్సిటీలో పలువురు మృత్యువాత పడడంతో మహా మృత్యుంజయ హోమం నిర్వహించాలని ఇటీవల రిజిస్ట్రార్ పేరుతో సర్క్యులర్ విడుదలైన విషయం తెలిసిందే. అందుకు టీచింగ్ సిబ్బంది రూ.500, నాన్ టీచింగ్ సిబ్బంది రూ.100 చొప్పున చెల్లించాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దీంతో ఒక్కసారిగా యూనివర్సిటీలో కలకలం రేగి విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. తమ మాట ఖాతరు చేయకుండా హోమాన్ని నిర్వహిస్తే అడ్డుకుంటామని ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హోమాన్ని రద్దు చేస్తూ రిజిస్ట్రార్ లక్ష్మయ్య సర్క్యులర్ విడుదల చేయడం గమనార్హం.

Kothagudem: 16 నెలల చిన్నారిపై అత్యాచారం కేసులో దోషికి 25 ఏళ్ల జైలు శిక్ష.. పాటిల్‌కు అభినందన