Vande Bharat Express : కటకటాల్లోకి త్రీ ఇడియట్స్.. విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి చేసిన నిందితులు అరెస్ట్

విశాఖలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి కేసులో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వందే భారత్ రైలుపై దాడి చేసిన నిందితులు చందు, దిలీప్, శంకర్ లపై కేసు నమోదు చేశారు.

Vande Bharat Express : కటకటాల్లోకి త్రీ ఇడియట్స్.. విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి చేసిన నిందితులు అరెస్ట్

Updated On : January 12, 2023 / 6:10 PM IST

Vande Bharat Express : విశాఖలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి కేసులో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వందే భారత్ రైలుపై దాడి చేసిన నిందితులు చందు, దిలీప్, శంకర్ లపై కేసు నమోదు చేశారు.

విశాఖ కంచరపాలెంలో వందే భారత్ రైలుపై దాడి చేసిన నిందితులను ట్రైన్ కున్న కెమెరా ఆధారంగా గుర్తించారు పోలీసులు. నిన్న కంచరపాలెంలో నిలిపి ఉంచిన వందేభారత్ ట్రైన్ పై దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో వందే భారత్ రైలు రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ట్రయల్ రన్ లో భాగంగా చెన్నై నుంచి విశాఖకు వందే భారత్ రైలు వచ్చింది.

Also Read..PM MODI..Vande Bharat Express : వందే భారత్‌ రైలు ప్రారంభించటానికి హైదరాబాద్ రానున్న ప్రధాని మోడీ

సికింద్రాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య పరుగులు పెట్టడానికి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ‘వందే భారత్’ ఎక్స్ ప్రెస్ రెడీ అవుతున్న విషయం విదితమే. త్వరలో సికింద్రాబాద్ లో ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా వందేభారత్ రైలు వైజాగ్ కు వచ్చింది. అయితే ముగ్గురు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి విశాఖకు వచ్చిన రైలును మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వందే భారత్ రైలు పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమవుతోంది. సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఈ ట్రైన్ పరుగులు పెట్టబోతోంది. ఈ రైలును ప్రధాని మోదీ జనవరి 15న వర్చువల్ గా ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఈ ట్రైన్ ను మొదటగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకే అనుకున్నారు. అయితే ట్రాక్ అప్ గ్రడేషన్ పనులు విజయవాడ-విశాఖపట్నం మధ్య పూర్తి కావడమే కాదు పలువురు నేతలు వందే భారత్ ను విశాఖపట్నం వరకు పొడిగించాలని విజ్ఞప్తులు చేయగా కేంద్ర ప్రభుత్వం తాజాగా విశాఖ వరకు పొడిగించింది.

Also Read..Vande Bharat Express: మోదీ ప్రారంభించిన వందేభారత్-3 రైలు విశేషాలు ఏంటో తెలుసా?

గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది. టికెట్ ధరలను రైల్వే శాఖ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆగస్టు నాటికి 75 వందేభారత్ ఎక్స్‭ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. 80 శాతం స్థానికంగా దొరికిన వస్తువులతోనే నిర్మాణం పూర్తిగా ఇండియాలోనే జరిగింది. మొత్తం వెయ్యి కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకు ఖర్చు పెడుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.