Sullurupeta Chits Scam : సూళ్లూరుపేటలో చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.12 కోట్లతో మహిళ పరార్

సూళ్లూరుపేటలో భారీ మోసం వెలుగుచూసింది. చిట్టీల పేరుతో ఓ మహిళ నిలువునా ముంచేసింది. సుమారు 12 కోట్లకు టోకరా వేసిన మహిళ.. కనిపించకుండా పోయిందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.

Sullurupeta Chits Scam : సూళ్లూరుపేటలో చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.12 కోట్లతో మహిళ పరార్

Sullurupeta Chits Scam : సూళ్లూరుపేటలో భారీ మోసం వెలుగుచూసింది. చిట్టీల పేరుతో ఓ మహిళ నిలువునా ముంచేసింది. సుమారు 12 కోట్లకు టోకరా వేసిన మహిళ.. కనిపించకుండా పోయిందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.

సూళ్లూరుపేట రైల్వే గేట్ రోడ్ లో నివసిస్తున్న పద్మావతి శెట్టి అనే మహిళ దుస్తుల వ్యాపారం చేస్తోంది. స్థానికంగా చాలా కాలం నుంచి వ్యాపారం చేస్తూ అందరి అభిమానం సంపాదించింది. ఈ పరిచయాలు ఉపయోగించుకుని కొన్నేళ్ల నుంచి చిట్టీలు వేయడం మొదలుపెట్టింది. మొదట్లో బాగానే సాగిన లావాదేవీలతో ఆమె వద్ద చిట్టీలు వేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. కొన్ని రోజుల నుంచి చిట్టీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్న పద్మావతి శెట్టి ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది.

Also Read..Chit Fund Fraud : ఏం తెలివి..! సంక్రాంతికి పప్పుల పేరుతో విజయనగరంలో ఘరానా మోసం.. లక్షల రూపాయలతో చిట్టీల వ్యాపారి పరార్

ఈ విషయం ఆ నోట ఈ నోట తెలుసుకున్న బాధితులు ఒక్కసారిగా ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆమె డబ్బుతో పరార్ అయ్యిందని తెలుసుకుని పద్మావతి ఇంట్లో ఉన్న దుస్తులను మూట కట్టి పట్టుకుని పోయారు కొందరు బాధితులు. ఎంతో కొంత దక్కించుకున్నామనే ఆశతో మరికొందరు బాధితులు ఆటోల్లో వచ్చి దుస్తుల మూటలను పట్టుకెళ్లారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.

పద్మావతి దుస్తుల వ్యాపారం చేస్తుంది. నలుగురిలో ఒక నమ్మకాన్ని సంపాదించుకుంది. దాన్ని ఆమె పెట్టుబడిగా వాడుకుంది. దుస్తులు కొనేందుకు తన దగ్గరికి వచ్చే వారిని, స్థానికంగా ఉండే ఉద్యోగులను నమ్మించింది. వాళ్లందరితో చిట్టీలు వేయించింది. వందలాది మందితో చిట్టీలు వేయించింది. అలా సుమారు రూ.12 కోట్లు వసూలు చేసింది. సడెన్ గా పెద్ద బాంబు పేల్చింది. మూడు రోజుల క్రితం ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది.

Also Read..Warangal Chit Fund Fraud : వరంగల్‌లో ఘరానా మోసం… రూ.40 కోట్లతో చిట్టీ వ్యాపారి ఉడాయింపు

ఊరు వదిలి వెళ్లిపోయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పద్మావతి ఇంటికి వెళ్లారు. అయితే, అక్కడ ఎవరూ లేరు. దీంతో బాధితులు పద్మావతి ఇంట్లో ఉన్న సామాను ఏది దొరికితే అది తమతో పట్టుకెళ్లారు. ఎంతోకొంత తమకు దక్కింది అనే ఆశతో వారు పద్మావతి ఇంట్లో ఏది దొరికితే అది పట్టుకుపోయారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పద్మావతి ఇంట్లో దుస్తులు ఉండగా.. వాటినే మూటకట్టుకుపోయారు బాధితులు. మరికొందరు వస్తువలు పట్టుకెళ్లారు. పద్మావతి ఎక్కడుందో కనిపెట్టి ఆమె పట్టుకుని రావాలని తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. బాధితుల్లో కొందరు రూ.10 లక్షలు నుంచి రూ.50 లక్షలు మోసపోయారు. వందలాది మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.