Warangal Chit Fund Fraud : వరంగల్‌లో ఘరానా మోసం… రూ.40 కోట్లతో చిట్టీ వ్యాపారి ఉడాయింపు

వరంగల్ లో మరో చిట్టీ వ్యాపారి ఘరానా మోసం బయటపడింది. చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ ఫైనాన్స్ వ్యాపారి పారిపోయాడు.(Warangal Chit Fund Fraud)

Warangal Chit Fund Fraud : వరంగల్‌లో ఘరానా మోసం… రూ.40 కోట్లతో చిట్టీ వ్యాపారి ఉడాయింపు

Warangal Chit Fund Fraud

Warangal Chit Fund Fraud : వరంగల్ లో మరో చిట్టీ వ్యాపారి ఘరానా మోసం బయటపడింది. చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ ఫైనాన్స్ వ్యాపారి పారిపోయాడు. వంద కాదు, రెండు వందలు కాదు.. ఏకంగా 900 మంది వద్ద నుంచి రూ.40 కోట్ల వరకు వసూలు చేసి పారిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమ అవసరాలకు ఉపయోగపడుతుందని కష్టపడి సంపాదించిన సొమ్మును పొదుపు చేస్తే వ్యాపారి నమ్మించి నట్టేట ముంచాడని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

లేబర్ కాలనీలో కల్పవల్లి అసోసియేట్స్ అండ్ ఫైనాన్స్, ట్రేడర్స్ చిట్ ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసింది. దాదాపు రూ.40 కోట్లతో కల్పవల్లి ఫైనాన్స్ యజమాని వెంకటేశ్వర్లు ఉడాయించారు. దాదాపు 900 మంది దగ్గర చిట్టీ రూపంలో డబ్బులు వసూలు చేశారు. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. లేబర్ కాలనీలో యజమాని ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు.(Warangal Chit Fund Fraud)

Share Market Fraud : లక్షకు రూ.15 లక్షలు వడ్డీ..! విజయవాడలో షేర్ మార్కెట్ పేరుతో భారీ మోసం

కాగా, అమాయక ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. చిట్టీ వ్యాపారులు కోట్ల రూపాయల డబ్బుతో ఉడాయించిన ఘటనలు అనేకం బయటపడ్డాయి. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. అడ్డంగా నమ్మి మోసపోతున్నారు. ఆ తర్వాత న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ బాధితులు తిరుగుతున్నారు.

చిట్ ఫండ్ సంస్థ నిర్వాహాకులు చిట్టీల పేరుతో రూ.40 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. ఎవరికీ తెలియకుండా ఇంటికి ‌తాళం వేసి ఐపీ పెట్టి పారిపోయారు.‌ నోటీసు అందుకున్న బాధితులు లబోదిబోమంటూ యజమాని ఇంటికి చేరి ఆందోళనకు దిగారు. తమ పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు ఉపయోగపడతాయని రూపాయి రూపాయి పోగుచేసి కల్పవల్లి ఫైనాన్స్‌లో పొదుపు చేస్తే నమ్మించి నట్టేట ముంచాడని బాధితుల ఆవేదన చెందుతున్నారు.(Warangal Chit Fund Fraud)

Warangal Chit Fund Fraud, Kalpavalli Associate Finance Traders Cheating

Warangal Chit Fund Fraud, Kalpavalli Associate Finance Traders Cheating

పెద్ద సంఖ్యలో వచ్చిన బాధితులు వెంకటేశ్వర్లు ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పారిపోయిన వెంకటేశ్వర్లు దంపతుల గురించి ఆరా తీశారు.

పాతబస్తీలో కి ‘లేడీ’ : రూ. 10 కోట్ల చిట్టీ డబ్బులతో జంప్

కాగా, వరంగల్‌లో చిట్టీల పేరుతో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కస్టమర్ల నుంచి ప్రతి నెలా చిట్టీ డబ్బులు వసూలు చేసి గడువు ముగిశాక చేతులెత్తేయడం లేదా డబ్బు తీసుకుని పారిపోవడం సర్వ సాధారణంగా మారింది. చిట్ ఫండ్ సంస్థల మోసాలు తరుచుగా వెలుగులోకి వస్తున్నా… ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. చిట్ ఫండ్ సంస్థలో పొదుపు చేస్తే ఎంతో కొంత డబ్బు వెనసుకోవచ్చనే ఆశే వారి పాలిట శాపంగా మారుతోంది. మరి కొందరు అధిక వడ్డీలకు ఆశపడి అడ్డంగా మోసపోతున్నారు.