Chandrababu : మూడు రాజధానుల బిల్లు రద్దుపై స్పందించిన చంద్రబాబు

మూడు రాజధానుల బిల్లు రద్దుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాజధాని అంశంలో జగన్ తీసుకున్న నిర్ణయంతో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయని అన్నారు.

Chandrababu : మూడు రాజధానుల బిల్లు రద్దుపై స్పందించిన చంద్రబాబు

Chandrababu (3)

Three Capitals Bill repeal : మూడు రాజధానుల బిల్లు రద్దుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాజధాని అంశంలో జగన్ తీసుకున్న నిర్ణయంతో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయని అన్నారు. రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి పడుతుందన్నారు. జగన్ తీరుతో రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లే ప్రమాదముందని చెప్పారు. మూడు రాజధానుల బిల్లు రద్దుపై టీడీపీలో విస్త్రత చర్చ జరుగుతోంది. ఉదయం నుంచి చంద్రబాబు..పార్టీ సీనియర్ నేతలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మూడు రాజధానుల బిల్లు రద్దు అంశం కూడా చర్చకు వచ్చింది. జగన్ చేసిన ప్రటకను విశ్వసించడానికి వీల్లేదని..రాష్ట్రంలోని సమస్యలను పక్కదారికి పట్టించడానికే జగన్ ఈ విధమైన ప్రకటనలను తెరపైకి తీసుకొచ్చారని చెబుతున్నారు. మూడు రాజధానుల అంశంపై జనగ్ చేసిన ప్రటకనను నమ్మడానికి వీల్లేదని అంటున్నారు.

AP High Court : మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించాలి : ఏపీ హైకోర్టు

రాజధాని విషయంలో జగన్ మొదటి నుంచి చేస్తున్న ప్రకటనల వల్లే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. గతంలో జగన్ చేసిన రాజధానుల ప్రకటన వల్లే రాష్ట్రానికి ఆర్థిక కష్టాల వచ్చాయని తెలిపారు. ఇప్పటికైనా సీఎం జగన్ ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటిస్తేనే ముందుకు వెళ్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.

మూడు రాజధానులపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. మెరుగైన బిల్లును మళ్లీ అసెంబ్లీ ముందుకు తీసుకొస్తామని సీఎం ప్రకటించారు. సోమవారం (నవంబర్ 22, 2021)న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ మాట్లాడారు.

Bihar : పెళ్లి మంట‌పంలో క‌ల‌క‌లం..వ‌ధువు గ‌దిలో మ‌గ పోలీసుల సోదాలు

ఏ పరిస్థితుల్లో మూడు రాజధానులు తీసుకొచ్చామో…ఆర్థిక మంత్రి బుగ్గన వివరించడం జరిగిందన్నారు. ఈ ప్రాంతమంటే తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని, తనకు ప్రేమ ఉందన్నారు. ఈ ప్రాంతంలోనే తనకు ఇల్లు ఉందని, రాజధానిలో రోడ్లు డెవలప్ చేయాడానికి డబ్బులు లేవని, అభివృద్ధి చేయాలంటే..ఎకరాకు రూ. 2 కోట్లు ఖర్చవుతుందని లెక్కలు చెప్పారు.