అంతర్రాష్ట్ర ప్రయాణాలకు తెలంగాణ గ్రీన్ సిగ్నల్

  • Published By: venkaiahnaidu ,Published On : May 31, 2020 / 11:00 AM IST
అంతర్రాష్ట్ర ప్రయాణాలకు తెలంగాణ గ్రీన్ సిగ్నల్

అంతర్రాష్ట్ర ప్రయాణాలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్న అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసింది. ఎలాంటి అనుమతి లేకుండానే ప్రయాణించే అవకాశం కల్పించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 8గంటల వరకు దుకాణాలు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

లాక్ డౌన్ 5.0 గైడ్ లైన్స్ ను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం…కేంద్ర నిబంధనల ప్రకారం రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుందని తెలిపింది. తెలంగాణలోని కంటైన్మెంట్ ఏరియాల్లో జూన్-30వరకూ లాక్ డౌన్ పొడిగించిన ప్రభుత్వం…మిగిలిన ప్రాంతాల్లో జూన్7వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపింది.