IAS Officers Transfer : ఏపీలో ఆరుగురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

ఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వీరిని బదిలీ చేస్తూ శనివారం (నవంబర్26, 2022) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్‌ అధికారి చామకురి శ్రీధర్‎ సీసిఎల్ఏలో విజిలెన్స్ జాయింట్ సెక్రటరీగా, ఎన్.తేజ్ భరత్‎ను తూర్పు గోదావరి జిల్లా జేసీగా బదిలీ చేసింది.

IAS Officers Transfer : ఏపీలో ఆరుగురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

ias officers transfered

IAS Officers Transfer : ఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వీరిని బదిలీ చేస్తూ శనివారం (నవంబర్26, 2022) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్‌ అధికారి చామకురి శ్రీధర్‎ సీసిఎల్ఏలో విజిలెన్స్ జాయింట్ సెక్రటరీగా, ఎన్.తేజ్ భరత్‎ను తూర్పు గోదావరి జిల్లా జేసీగా బదిలీ చేసింది. అపరాజిత సింగ్‎ను కృష్ణా జిల్లా జేసీగా, టి. నిశాంతిని నంద్యాల జిల్లా జేసిగా నియమించింది.

మహేష్‎కుమార్‌ను పంచాయితీ రాజ్ శాఖ అదనపు కమిషనర్‎గా, ఎన్. మౌర్యను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Reservation For Home Guards : ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. కానిస్టేబుల్ పోస్టుల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు

కాగా, ఫిబ్రవరి 22, 2022న అమరావతిలో సీనియర్ ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. అందులో సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్ జవహర్ రెడ్డిని నియమించారు.