Reservation For Home Guards : ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. కానిస్టేబుల్ పోస్టుల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు

ఏపీ సీఎం జగన్ హోంగార్డులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలను సవరించి హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు.

Reservation For Home Guards : ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. కానిస్టేబుల్ పోస్టుల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు

reservation for home guards

reservation for home guards : ఏపీ సీఎం జగన్ హోంగార్డులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలను సవరించి హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్సీ, ఎస్ఏఆర్ సీపీఎల్, కానిస్టేబుళ్ల పోస్టులతోపాటు పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్, మెకానిక్స్, డ్రైవర్ పోస్టుల నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం.

సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్స్ విభాగాల్లో మహిళా, పురుష కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు వర్తింపజేశారు. ఏపీఎస్సీ, ఏస్ ఏఆర్ సీపీఎల్, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్, మోకానిక్, డ్రైవర్ కేటగిరీల్లో పురుష కానిస్టేబుల్ పోస్టులే భర్తీ చేయనున్నారు. అందుచేత ఆ విభాగాల పోస్టుల భర్తీలో పురుష హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. కానిస్టేబుల్ నియామకాల్లో కేటగిరిలవారీగా 5 శాతం 25 శాతం వరకు హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు.

CM Jagan : సీఎం జగన్ గొప్ప మనసు.. చిన్నారి ప్రాణానికి భరోసా

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ రూల్ 1999కి సవరణ చేస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి కానిస్టేబుల్ నియామకాల్లో ఈ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. త్వరలో 6,500 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్న నేపథ్యంలో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రాష్ట్రంలో 15,000 మంది హోంగార్డులకు ప్రయోజనం కలుగనుంది.

హోంగార్డులకు ప్రయోజనం కల్పిస్తూ సీఎం జగన్ సరైన సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలికంగా పని చేస్తున్నప్పటికీ పోలీసు శాఖలో హోంగార్డులు తగిన గుర్తింపుకు నోచుకోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హోంగార్డుల జీతాలు పెంచింది. దీంతో అప్పటివరకు నెలకు రూ.18000 మాత్రమే ఉన్న హోంగార్డుల జీతాన్ని రూ.21,300కి పెంచుతూ 2019 అక్టోబర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది.

Industries : ఏపీలో రూ.2వేల 134 కోట్లతో కొత్తగా 5 పరిశ్రమలు.. 7వేల 683 మందికి ఉద్యోగాలు

ఇప్పుడు హోంగార్డులకు మరింత మేలు చేకూరుస్తూ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పోలీసు నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. అయితే అంతకంటే ముందే హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడం వారికి వరంగా మారిందని చెప్పవచ్చు.