CAG Report : రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ ఆర్థిక వ్యవహారాలు : కాగ్

ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదిక ప్రవేశపెట్టింది.

CAG Report : రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ ఆర్థిక వ్యవహారాలు : కాగ్

Cag

CAG objected to AP’s financial situation : ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదిక ప్రవేశపెట్టింది. ఏపీ ఆర్థిక పరిస్థితి, వనరుల నిర్వహణపై కాగ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని తెలిపింది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయని వెల్లడించింది.

చట్ట సభల ఆమోద ప్రక్రియను, బడ్జెట్ మీద అదుపును బలహీనపర్చారని కాగ్ విమర్శించింది. అసెంబ్లీ ఆమోదించిన కేటాయింపుల కంటే అధికంగా ఖర్చు చేసే సందర్భాలు పునావృతం అయ్యాయని పేర్కొంది. 2019-20లో 3.17 శాతం రెవెన్యూ రాబడులు తగ్గాయిన తెలిపింది. కొత్త సంక్షేమ పథకాలతో 6.93 శాతం రెవెన్యూ ఖర్చులు పెరిగాయని వెల్లడించింది.

MLC Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ ఉపసంహరణ గడువు

2019-20కి 90.24 శాతం రెవెన్యూ లోటు పెరిగిందని కాగ్ తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి 32,373 కోట్ల మేర బకాయిల చెల్లింపులు పెరిగాయని పేర్కొంది. చెల్లించాల్సిన బకాయిల వివరాలను బడ్జెట్ పత్రాల్లో సరిగా చూపలేదని తెలిపింది. శాసనసభను నీరుగర్చేలా నిధుల నిర్వహణ ఉందని కాగ్ నివేదిక పేర్కొంది.