Tirumala Brahmotsavam : వెంకన్న స్నపన తిరుమంజనం కోసం జపాన్ ఆపిల్స్, మస్కట్ ద్రాక్ష..కొరియా పియర్స్,అమెరికా చెర్రీస్

వెంకన్న స్నపన తిరుమంజనం కోసం జపాన్ ఆపిల్స్, మస్కట్ ద్రాక్ష..కొరియా పియర్స్,అమెరికా చెర్రీస్, థాయ్ లాండ్ నుంచి మామిడిపండ్లు భాగమయ్యాయి.

Tirumala Brahmotsavam : వెంకన్న స్నపన తిరుమంజనం కోసం జపాన్ ఆపిల్స్, మస్కట్ ద్రాక్ష..కొరియా పియర్స్,అమెరికా చెర్రీస్

Tirumala Brahmotsavam

Tirumala Brahmotsavam  2022 : బ్రహ్మాండనాయుడు ఏడు కొండలపై వెలసిని శ్రీ వేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా ప్రారంభమయ్యాయి. ఎక్కడెక్కడో పూసిన పువ్వులు..వేరే దేశాలలో కాసిన పండ్లు శ్రీవారి కోసమే అన్నట్లుగా కేవలం భారత్ లోని పలు ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా తరలివచ్చాయి. బ్రహ్మోత్సవాల వేడుకలతో తిరువీధులు కన్నుల పండవగా అలరారుతున్నాయి. సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమై భక్తులను పరవశింపజేస్తున్నాయి. మలయప్ప స్వామి హంస వాహనంపై రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు తిరుమాఢ వీదుల్లో విహరించారు. వీణ ధరించి, సరస్వతీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు వేలాదిగా తిరుమలకు తరలి వస్తున్నారు. హంసవాహన సేవలో శ్రీ వేంక‌టేశ్వర‌స్వామి జ్ఞానమూర్తిగా కనిపించి భక్తులకు కనువిందు చేశాడు. హంస అంటే జ్ఞానానికి ప్రతీక. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధిని కలిగించేందుకు మలయప్ప స్వామి హంస వాహనంపై కనిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా ఎక్కడెక్కడో స్వామివారి కోసమే విరిసిన పువ్వులు తిరుమల కొండకు చేరుకుంటున్నాయి. ఆ బ్రహ్మండనాయకుని సేవలో తరించిపోవటానికితపించిపోతున్నాయి. శ్రీవారి అలంకరణలో ఎన్నోరకాల పువ్వులు తమ పుట్టుక ధన్యం అయినట్లుగా తరించి తపించిపోతున్నాయి.పువ్వులే కాదు శ్రీవారి కోసం విదేశాలలో పండిన పండ్లు కూడా తిరుమల కొండకు..శ్రీవారి పెన్నిథికి చేరుకున్నాయి. జపాన్ నుంచి ఆపిల్స్, మస్కట్ నుంచి ద్రాక్ష పండ్లు, కొరియా నుంచి పియర్స్ పండ్లు శ్రీవారి కోసం పరుగులిడుతు వచ్చాయి. వెంకన్న కోసం విదేశాల నుంచి పండ్లు తరలి వచ్చాయా? అనిపిస్తోంది కదూ..నిజమే మరి అపురూపమైన అద్భుతమైన ఈ సృష్టిలో కొన్ని మాత్రం ప్రత్యేకించి శ్రీవారి కోసమే అన్నట్లుగా విదేశాల నుంచి కొన్ని రకాల పండ్లు తిరుమలకు తీసుకొచ్చారు అర్చకులు.

Dussehra 2022 : వందల ఏళ్ల చరిత్ర కలిగిన మైసూర్ దసరా ఉత్సవాలు .. చాముండీ అమ్మవారి విశేష పూజలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న క్రమంలో నేటి సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ ఉత్సవం కోసం ఏకంగా జపాన్ నుంచి ఆపిల్స్, మస్కట్ నుంచి ద్రాక్ష, కొరియా నుంచి పియర్స్ పండ్లు తెప్పించినట్టు టీటీడీ వెల్లడించింది. స్వామివారి ప్రత్యేక అలంకరణ కోసం ఒక టన్ను కట్ ఫ్లవర్స్, పండ్లు వినియోగించామని వివరించింది. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన 2, 3, 4, 9వ రోజుల్లో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో చోటుచేసుకునే దోష నివారణ నిమిత్తం ఈ క్రతువు చేపడతారు. ఇందులో ప్రధానంగా పసుపు నీళ్లతోనూ, కొబ్బరి నీరు, తేనె, వివిధ సుగంధ ద్రవ్యాలతోనూ స్వామివారికి అభిషేకం చేస్తారు. స్వామివారిని, దేవేరులను తులసిమాలలతో అలంకరిస్తారు.

Pradyumna Shrinkhala Devi : బాలింతలా నడికట్టు వేసుకునే అమ్మవారు .. శృంఖలాదేవి, చోటిల్లామాతగా పిలబడే అమ్మ

శ్రీవారి స్నపనం కోసం జపాన్ ఆపిల్స్, మస్కట్ గ్రేప్స్, కొరియన్ పియర్స్ తిరుమలకు చేరుకున్నాయి. ప్రత్యేక అలంకరణకు ఒక టన్ను కట్ ఫ్లవర్స్, పండ్లు స్వామివారి సన్నిధికి వచ్చాయి. దేశీయ తృణ ధాన్యాలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు శ్రీవారి కైంకర్యంలో ఏ విధంగా తరిస్తున్నాయో, ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో జపాన్ నుంచి యాపిల్స్, మస్కట్ నుంచి ద్రాక్ష, కొరియా నుంచి పియర్స్, థాయిలాండ్ నుంచి మామిడి, అమెరికా నుంచి చెర్రీస్ స్వామివారి సేవలో తరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారిపై ఉన్న భక్తితో వేలాది కిలోమీటర్ల లోని తమ స్వస్థలాల నుంచి ఈ పండ్లు, పుష్పాలను స్వామివారికి సమర్పించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు.