Dussehra 2022 : వందల ఏళ్ల చరిత్ర కలిగిన మైసూర్ దసరా ఉత్సవాలు .. చాముండీ అమ్మవారి విశేష పూజలు

వందల ఏళ్ల చరిత్ర కలిగిన మైసూర్ దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. చాముండీ అమ్మవారిని పూజించి తరిస్తున్నారు భక్తులు.

Dussehra 2022 : వందల ఏళ్ల చరిత్ర కలిగిన మైసూర్ దసరా ఉత్సవాలు .. చాముండీ అమ్మవారి విశేష పూజలు

mysore Chamundeshwari devi Dussehra festival special

Dussehra 2022 : దసరా అంటే మైసూర్.. మైసూర్ అంటే దసరా. దేశమంతా జరిగే దసరా ఉత్సవాలు ఒక ఎత్తైతే మైసూర్ లో జరిగే దసరా వేడుకలు మరో ఎత్తు. మైసూర్ మహారాజుల కాలం నుంచి ఈనాటి వరకు చాముండీ దేవి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. మైసూర్ లో జరిగే దసరా ఉత్సవాలకు 400ల ఏళ్ల చరిత్ర ఉంది.విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత కన్నడ ప్రాంతం అంతా వడయార్ల అధీనంలోకి వెళ్లిపోయింది. మొట్టమొదటిసారిగా కీ.శ 1610 ప్రాంతంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. 1659లో ఆనాటి దొడ్డ దేవరాజు ఆలయాన్ని పునరుద్ధరించి మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు. అలా మొదలైన ఉత్సవాలు నేటికి కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారికి 12 రోజుల పాటు ఆభరణాలు అలంకరణ మహోత్సం జరుగుతుంది.1905లో రాజభవనంలో దసరా రోజు రాజదర్బార్ ఏర్పాటు చేసే సంప్రదాయం మూడో కృష్ణ రాజ వడయార్ మొదలుపెట్టారు. అప్పటినుంచి దసరా ఉత్సవాలు రాజకీయ సొబగులు అద్దుకున్నాయి.

మైసూరు దసరా ఉత్సవాలు అంటే రాజభాగోల ఊరేగింపులు మాత్రమే కాదు. మైసూరు దసరా ఓ చరిత్ర, అదో కల, సాహిత్యం, క్రీడలు, సంసృతి, సాంప్రధాయాలు కలబోసిన ప్రత్యేక సంగమం. కర్ణాటక సంసృతి, సాంప్రధాయాలు, భారతదేశ సంసృతి, సాంప్రధాయాలుకు అద్దం పడుతూ మైసూరు దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆదునిక సాంప్రధాయలకు అనుగుణంగా మైసూరు దసరా ఉత్సవాల కార్యక్రమాలు జరుగుతాయి. మైసూరు దసరా ఉత్సవాలకు నాలుగు దశాభ్దాల చరిత్ర ఉంది. మైసూరు దసరా ఉత్సవాల సందర్బంగా చాముండిదేవిని 9 అవతారాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేస్తారు. మైసూరు దసరా ఉత్సవాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. చాముండేశ్వరి దేవి మైసూరు మహారాజులు తమ ఇంటి దేవతగా పూజిస్తారు. మైసూర్ మహారాజులు చాముండేశ్వరి దేవిని పూజిస్తూ కులదేవతగా ఆరాధించారు.

1399 నుంచి 1970 సంవత్సరం వరకు 26 కలాలకు చెందిన ఒడయార్ లు మైసూరు మహా సామ్రాంజ్యాన్ని పరిపాలించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మైసూరు మహా సామ్రాజ్యం ప్రత్యేకంగా ఉండేది. రిపబ్లిక్ డే సందర్బంగా 1970లో మైసూరు మహా సామ్రాజ్యం భారతదేశంలో విలీనం అయ్యింది. బ్రిటీష్ కాలంలో మైసూరు మహా సామ్రాజ్యం 9 జిల్లాలు మాత్రమే ఉండేది. 1956 నవంబర్ 1వ తేదీ మైసూరురాష్ట్రం అయ్యింది. దేవరాజ్ అరసు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1973 నవంబర్ 1వ తేదీ మైసూరు రాష్ట్రం కర్ణాటకలో విలీనం అయ్యి అఖిల కర్ణాటకగా అవతరించింది.

కర్ణాటక రాజధాని బెంగళూరు. అయితే ఇప్పటికీ కర్ణాటక సాంసృతిక రాజధాని మాత్రం మైసూరు నగరంగా నిలిచిపోయింది. గత నాలుగు దశాభ్దాలుగా మైసూరు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ మైసూరు దసరా ఉత్సవాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నది. 1399లో మైసూరు అరసు వంశస్తులు మైసూరు మహా సామ్రాజ్యం చరిత్రను చాటి చెప్పడానికి శ్రీకారం చుట్టారు. రాజవంశానికి చెందిన యదురాయ, కృష్ణరాయ మైసూరు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానికుల సహకారంతో మైసూరు దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. దసరా ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మైసూరు దసరా ఉత్సవాల్లో జంబూసవారికి ఓ ప్రత్యేకత ఉంది.

విజయదశమి వస్తుందంటే చాలు.. కర్ణాటక అంతటా పండగే. అందులోనూ మైసూర్ నగరం ఆ ఉత్సవాలకు కేరాఫ్ అడ్రస్‌. ఇక్కడ.. నాటి రాజుల కాలం నుంచి ఇప్పటివరకు.. అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పండుగగా నిర్వహించే ఈ వేడుకలకు 400 ఏళ్లనాటి చరిత్ర ఉంది. ఇక్కడి సందడి చూసేందుకు.. దేశవిదేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారంటే.. వేడుకలు ఏస్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

కర్ణాటక రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా ఈ ఉత్సవాలు జరుగుతాయి. మహారాజు కులదైవమైన.. చాముండేశ్వరీ దేవిని అలంకరించి, ఆరాధించి.. ఏనుగులపై ఊరేగించడం ఇక్కడ సంప్రదాయం. ఆ సమయంలో.. మైసూర్ ప్యాలెస్ ముందు నుంచి బన్నీమంటపం వరకు ఉండే వీధులన్నీ కోలాహలంగా మారిపోతాయి. ఈ వేడుకలు కేవలం అమ్మవారి పూజలకు మాత్రమే పరిమితం కాదు. ఆ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను కూడా తెలియజేస్తాయి. కళాకారుల ప్రదర్శనలు వాటిని ప్రతిబింబిస్తాయి.

మైసూర్ ప్యాలెస్ ప్రత్యేక అలంకరణతో వెలిగిపోతుంది. రాజుగారి ఆయుధపూజ, ఫ్లోటింగ్ కారు ఉత్సవాలు, ఏనుగుల అలంకరణ.. ఇలా వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయి. నవరాత్రుల్లో.. తొమ్మిదో రోజున మైసూర్ రాజవంశానికి చెందిన రాచఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకొచ్చి పూజలు చేయడం ఆకట్టుకుంటుంది. మొత్తంగా… ప్రతిఘట్టం, ప్రతిదృశ్యం కన్నుల పండువగా సాగుతుంది. అందుకే ఈ వేడుకలను చూసేందుకు జనం భారీ సంఖ్యలో తరలివస్తారు. ఇసుకేస్తే రాలనంత జనంతో ప్యాలెస్‌ కిటకిటలాడిపోతుంది.

వాయిస్ః దసరాకు ముందు 9రోజులపాటు శక్తిమాతకు పూజలు జరుగుతాయి. దసరా రోజున మైసూరు మహారాజా ప్యాలెస్‌ లక్షలాది విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మైసూర్ మహారాజుల నివాసం అయిన ఈ ప్యాలెస్‌లోనే ఉత్సవాలకు సంబంధించిన విలువైన వస్తువులను భద్రపరుస్తారు. ప్యాలెస్‌లోని అత్యంత విలువైన బంగారు సింహాసనాన్ని దసరా వేడుకలు జరిగే పది రోజుల పాటు ప్రజలకు తిలకించే అవకాశాన్ని కల్పిస్తారు.

వాయిస్ః వందల ఏళ్ల క్రితం మైసూరుకు చెందిన రాజ కుటుంబం ప్రారంభించిన ఈ వేడుకలు.. ఇప్పటికీ అంతే ఉత్సాహంతో, అంతే భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉడయార్ రాజ వంశం ఈ వేడుకలను ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీరంగపట్నం రాజధానిగా పరిపాలన చేసిన ఒడయార్ వంశీకులు.. 1610లో తమ రాజధానిని మైసూరుకు మార్చారు. అప్పటి నుంచి దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ ఆ రాజ కుటుంబం చేతుల మీదుగానే జరుగుతున్నాయి.

వాయిస్ః విజయనగర సామ్రాజ్యంలో దసరా ఉత్సవాల్సి అట్టహాసంగా నిర్వహించేవారు. ఈ ఉత్సవాల కోసం.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దసరా దిబ్బను ఇప్పటికీ హంపిలో చూడవచ్చు. హంపిలో ఉత్సవాలను చూసి స్ఫూర్తిపొందిన మైసూరు ఒడయారు రాజు.. నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఆ తర్వాత కొంత కాలానికి.. రాజధాని మైసూరుకు మారడంతో.. ఉత్సవాలను కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు.మొత్తంగా… ఈ పదిరోజుల పండగకు నెల రోజుల ముందు నుంచే మైసూరు ముస్తాబవుతుంది. నగరమంతా పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. అందుకే… ఇక్కడి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.