IND vs AUS : నాలుగో టీ20 ముందు క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. భారత్‌కు బంపర్ ఆఫరే ఇది..!
భారత్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు (IND vs AUS) ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
Travis Head released from IND vs AUS T20I squad to play Sheffield Shield
IND vs AUS : భారత్, ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20 మ్యాచ్‌లో ఆసీస్, మూడో టీ20 మ్యాచ్‌లో (IND vs AUS) భారత్ విజయం సాధించింది. దీంతో ప్రస్తుతానికి సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇక నాలుగో టీ20 మ్యాచ్ గురువారం (నవంబర్ 6న) గోల్డ్‌కోస్ట్ వేదికగా జరగనుంది.
కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను జట్టు నుంచి విడుదల చేసింది. యాషెస్ సిరీస్ వ్యూహాల్లో భాగంగానే క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్‌తో నవంబర్ 21 నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ తొలి టెస్టులో ఆడే ఆటగాళ్లు అందరూ కూడా ఈ సిరీస్ కన్నా ముందు షెఫీల్డ్ షీల్డ్‌లో పాల్గొనే పాల్గొనాలని సూచించింది. ఈ క్రమంలోనే హెడ్‌ను విడుదల చేసింది.
షెఫీల్డ్ షీల్డ్‌లో ట్రావిస్ హెడ్ సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడనున్నాడు. సీనియర్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ లు న్యూసౌత్ వేల్స్ తరఫున, కామెరూన్ గ్రీన్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ఆడతారు. కాగా.. ఇక హెడ్ స్థానంలో ఎవరీని తీసుకోలేదు.
Every member of Australia’s likely first #Ashes Test squad will feature in the next round of #SheffieldShield 🥰
Full story: https://t.co/bjZMGbMp01 pic.twitter.com/4h0oUOR5le
— cricket.com.au (@cricketcomau) November 2, 2025
భారత్‌తో టీ20 సిరీస్‌లో విఫలం..
భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ట్రావిస్ హెడ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. రెండో టీ20 మ్యాచ్‌లో 28 పరుగులు చేయగా, మూడో మ్యాచ్‌లో 6 పరుగులు మాత్రమే చేశాడు.
భారత్‌తో నాలుగు, ఐదో టీ20 మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా జట్టు ఇదే..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్లి బియర్డ్‌మన్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఇల్లిస్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్‌లెట్, బెన్ డ్వార్షుయిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపా
