ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3 రివ్యూ.. దీని గురించి తెలుసుకుంటే చాలు కొనేస్తారనేలా ఫీచర్లు..

ఫోమ్ ప్రయోజనం ఏమిటంటే, అది చెవిలోకి నొక్కి పెట్టిన తర్వాత విస్తరించి చెవి ఆకారానికి సరిపోయి దాదాపు పూర్తి సీలింగ్ ఇస్తుంది. సాధారణ సిలికాన్ ఇయర్‌టిప్‌లు ఈ స్థాయి సీల్ ఇవ్వలేవు.

ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3 రివ్యూ.. దీని గురించి తెలుసుకుంటే చాలు కొనేస్తారనేలా ఫీచర్లు..

Apple AirPods Pro 3

Updated On : November 3, 2025 / 4:58 PM IST

Apple AirPods Pro 3 Review: ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3 ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందుతోన్న ఆడియో డివైజ్‌లలో ఒకటి. ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి ఇది అందుబాటులో ఉంది. ఇప్పటికే చాలా మంది దీన్ని కొని రివ్యూలు ఇచ్చారు. 2022లో విడుదలైన ఎయిర్‌పాడ్స్ ప్రో 2కి కొనసాగింపుగా ఎయిర్‌పాడ్స్ ప్రో 3 మార్కెట్లోకి వచ్చింది. ఎయిర్‌పాడ్స్ ప్రో 2 ఆడియో క్వాలిటీ, నాయిస్‌ క్యాన్సలేషన్, ఇతర అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంది.

ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 2 చాలా కాలంగా మార్కెట్‌లో ఉన్నప్పటికీ, వాటి స్థిరమైన పనితీరు, క్లాసిక్ రూపకల్పనతో ఇప్పటికీ వాటి అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3 మార్కెట్లో దుమ్మురేపుతోంది. దీని రివ్యూ చూద్దాం..

ఈ కొత్త మోడల్‌ను ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 2తో పోలిస్తే నాయిస్‌ క్యాన్సలేషన్‌లో 2 రెట్లు మెరుగుదల ఉంది. దీన్ని ప్రపంచంలో అత్యుత్తమ ఇన్‌ఇయర్ నాయిస్‌ క్యాన్సలేషన్ సాంకేతికతగా భావించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

మెరుగైన ఆడియో నాణ్యత, గుండె స్పందన గుర్తింపు, ఐపీ57 రేటింగ్‌, మరింత కచ్చితమైన ఫైండ్ మై ఫీచర్‌, కొత్త లైవ్ ట్రాన్స్‌లేషన్ సదుపాయం ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3లో ఉన్నాయి. ఫైండ్ మై అంటే ఆపిల్ డివైజ్‌ను కనుక్కోవడానికి సహాయపడే ట్రాకింగ్ సదుపాయం. లైవ్ ట్రాన్స్‌లేషన్ అంటే మాటలను వింటూనే అనువాదం చేసే సాంకేతికత.

అదే సమయంలో అడాప్టివ్ ఈక్యూ, డైనమిక్ హెడ్ ట్రాకింగ్‌తో వ్యక్తిగత స్పేషియల్ ఆడియో, వినికిడి డివైజ్‌ ఫంక్షన్‌, వినికిడి రక్షణ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. మొత్తం మీద బ్యాటరీ లైఫ్ 6 గంటల నుంచి 8 గంటలకు పెరిగింది. ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3 ధర రూ.25,900.

Also Read: మరో ఘోర ప్రమాదం.. ఫుల్లుగా తాగేసి వాహనాలను ఢీకొట్టిన ట్రక్కు డ్రైవర్.. 10 మంది మృతి.. 50 మందికి గాయాలు..

ఎయిర్‌పాడ్స్ ప్రో 3 డిజైన్

ఎయిర్‌పాడ్స్ ప్రో 3 డిజైన్ మొత్తం గతంలో ఎయిర్‌పాడ్స్ నుంచి కొనసాగిన శైలిలోనే ఉంది. ఈ మూడవ తరం ప్రో మోడల్‌లో.. చెవిలో ఉండే ఇయర్‌బడ్ భాగాలను కొంత మార్చారు. ముందుగా, ఇయర్‌టిప్ యాంగిల్‌ ఇప్పుడు ఇయర్‌బడ్‌ ప్రధాన భాగానికి మరింత నిలువుగా ఉంటుంది. పొడవైన ఫ్లాంజ్‌ వల్ల ఇయర్‌టిప్‌లు ముందుకు మరింతగా పొడవుగా వస్తాయి. దీని వల్ల చెవిలో లోతుగా ఇముడుతాయి. వ్యాయామ సమయంలోనూ చెవిలో స్థిరంగా ఉంటాయి.

కంఫర్ట్‌

ఏ హెడ్‌ఫోన్లకైనా శబ్ద నాణ్యత ఎంత ముఖ్యమో సౌకర్యం కూడా అంతే ముఖ్యం. ఎయిర్‌పాడ్స్ ప్రో 3 విషయంలో చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.

ఆపిల్ నాయిస్‌ క్యాన్సలేషన్ పనితీరును మెరుగుపరచడం లక్ష్యంగా ఫోమ్ ఇన్‌సర్ట్‌లతో ఉన్న ఇయర్‌టిప్‌లను ఉపయోగించాలని నిర్ణయించింది. కానీ దీని ఫలితంగా ఈ ఇయర్‌బడ్‌లను ధరించినప్పుడు సౌకర్య స్థాయి గణనీయంగా తగ్గింది.

ప్రీమియం లేదా కొంత చవకైన ఐఈఎమ్‌లలో (ఇన్‌ఇయర్ మానిటర్‌లు) ఫోమ్ ఇయర్‌టిప్‌లు సాధారణంగా కనిపిస్తాయి. ఐఈఎమ్ (ఇన్‌ఇయర్ మానిటర్‌) అంటే చెవిలో లోతుగా ఇమిడే ప్రొఫెషనల్ వినికిడి డివైజ్‌లు.

ఫోమ్ ప్రయోజనం ఏమిటంటే, అది చెవిలోకి నొక్కి పెట్టిన తర్వాత విస్తరించి చెవి ఆకారానికి సరిపోయి దాదాపు పూర్తి సీలింగ్ ఇస్తుంది. సాధారణ సిలికాన్ ఇయర్‌టిప్‌లు ఈ స్థాయి సీల్ ఇవ్వలేవు. కానీ దుష్ప్రభావం ఏమిటంటే, విస్తరించే ఫోమ్ వల్ల చెవి గోడలపై ఒత్తిడి పడుతుంది. అందువల్ల చాలా మందికి అవి అసౌకర్యంగా అనిపిస్తాయి.

ఎయిర్‌పాడ్స్ ప్రో 3లో యాపిల్ ఉపయోగించిన ఇయర్‌టిప్‌లు పూర్తిగా ఫోమ్‌తో చేయలేదు. కానీ సిలికాన్‌లోపల ఉన్న ఫోమ్ ఇన్‌సర్ట్‌లు వాటికి అలాంటి లక్షణాలనే కలిగించాయి. ప్రతి సారి వాటిని చెవిలో పెట్టేటప్పుడు తిప్పి సరిపెట్టాలి, దీని వల్ల చెవిపై కొంత ఒత్తిడి పడుతుంది.

సాఫ్ట్‌వేర్‌, ఫీచర్లు

సాఫ్ట్‌వేర్ వివరాల్లోకి వెళ్లే ముందు ఒక విషయం గుర్తించాలి. బీట్స్ ఉత్పత్తులతో పోల్చితే ఆపిల్ ఇప్పటికీ ఎయిర్‌పాడ్స్‌ను తన డివైజ్‌లకే అనుకూలంగా రూపకల్పన చేస్తోంది. వీటిలో ఐఫోన్‌, ఐప్యాడ్‌, మాక్‌, ఆపిల్ వాచ్‌, ఆపిల్ టీవీ, విజన్ ప్రో హెడ్‌సెట్ ఉన్నాయి. ఇవి ఆపిల్ కాని పరికరాలతో జతచేయవచ్చు. దీంతో ఆడియో, కాల్స్‌, ఏఎన్‌సీ (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌) మాత్రమే అందుతాయి.

ఆపిల్ డివైజ్‌లు కాకుండా వేరే డివైజ్‌లతో ఎయిర్‌పాడ్స్ ప్రో 3 (లేదా ఏ ఎయిర్‌పాడ్స్ అయినా) వాడడాన్ని విశ్లేషకులు సిఫార్సు చేయట్లేదు. ఎయిర్‌పాడ్స్ ప్రో 3 వాడకం చాలా సులభం. ఫోన్ పక్కన కేస్ తెరవగానే జత చేయమని చూపించే పాప్‌అప్ వస్తుంది.

ఆ తర్వాత ప్రత్యేక యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొత్తం ఫంక్షనాలిటీ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనే ఉంటుంది. ఇది ముఖ్యంగా మాక్‌లో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇతర బ్రాండ్ల ఆడియో డివైజ్‌లు డెస్క్‌టాప్ యాప్‌లు ఇవ్వవు. ఈ ఫీచర్లను మీ డివైజ్‌ సెట్టింగ్స్ యాప్‌లో పొందవచ్చు. ఐఓఎస్‌లో ఆ ఆప్షన్‌ పైభాగంలో కనిపిస్తుంది.