GVMC Mayor : విశాఖలో చెట్లపై వేటు.. పార్కింగ్ కోసం పచ్చని చెట్లను నరికారు.

పచ్చదనాన్ని కాపాడాల్సిన జీవీఎంసీ అధికారులే.. చెట్లపై వేటు వేస్తున్నారు. మేయర్ కారు పార్కింగ్ కోసం ఏకంగా గ్రీన్ బెల్ట్ లోని పచ్చని చెట్లను కొట్టేస్తున్నారు. విశాఖ మేయర్ గోలగాని హరివెంకట కుమారి పెదగరలో నివాసం ఉంటున్నారు. తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. అయితే మేయర్ నివాసానికి సమీపంలో వీఆర్డీఎస్ రోడ్డుకు సర్వీసు రోడ్డుకు మధ్యలో 10 మీటర్ల వెడల్పున గ్రీన్ బెల్ట్ ఉంది.

GVMC Mayor : విశాఖలో చెట్లపై వేటు.. పార్కింగ్ కోసం పచ్చని చెట్లను నరికారు.

Gvmc Mayor

GVMC Mayor : పచ్చదనాన్ని కాపాడాల్సిన జీవీఎంసీ అధికారులే.. చెట్లపై వేటు వేస్తున్నారు. మేయర్ కారు పార్కింగ్ కోసం ఏకంగా గ్రీన్ బెల్ట్ లోని పచ్చని చెట్లను కొట్టేస్తున్నారు. విశాఖ మేయర్ గోలగాని హరివెంకట కుమారి పెదగరలో నివాసం ఉంటున్నారు. తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. అయితే మేయర్ నివాసానికి సమీపంలో వీఆర్డీఎస్ రోడ్డుకు సర్వీసు రోడ్డుకు మధ్యలో 10 మీటర్ల వెడల్పున గ్రీన్ బెల్ట్ ఉంది.

ఆ ప్రాంతాన్ని వాహనాల పార్కింగ్ కు కేటాయించాలని మేయర్ కుటుంబం కోరింది. అధికారులు వెనుకాముందు ఆలోచించకుండా 150 మీటర్ల పొడవునా గ్రీన్ బెల్ట్ జేసీబీతో తవ్వేసి లెవెల్ చేసేశారు. ఇందుకోసం ఆ ప్రాంతాల్లో ఉన్న పదుల సంఖ్యలోకి చెట్లను నరికేశారు.
ఇక ఇదే అంశంపై మేయర్ మాట్లాడారు.. క్యాంపు కార్యాలయానికి వచ్చే వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నందున గ్రీన్ బెల్ట్ లో కొంచం మార్పులు చేర్పులు చేశామని మేయర్ హరివెంకట కుమారి చెబుతున్నారు.

ఇక అదే స్థలంలో అందమైన మొక్కలను పెంచి పచ్చదనం కాపాడతామని మేరు తెలిపారు. మరోవైపు గ్రీన్ బెల్ట్ తొలగింపుకు సంబంధించి ఫైల్ తన వద్దకు రాలేదన్నారు కమిషనర్