Tirumala : తిరుమలలో కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు.. మూడేళ్ల తర్వాత పున:ప్రారంభం
భక్తుల రద్దీ ఆధారంగా టోకెన్ల కోటా పెంచే ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గతంలో కోవిడ్ కారణంగా దివ్యదర్శనం టోకెన్లు టీటీడీ నిలిపివేసింది. మూడేళ్ల తర్వాత తిరిగి దివ్యదర్శనం టోకెన్లు ప్రవేశపెట్టింది.

Tirumala
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మరో శుభవార్త అందించింది. కాలి నడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జాTirumalaరీ చేస్తోంది. శనివారం నుంచి దివ్యదర్శనం టోకెన్ల జారీని టీటీడీ పున:ప్రారంభించింది. వారం రోజులపాటు ప్రయోగాత్మకంగా నిర్వహించనుంది. అలిపిరి నడక మార్గంలో రోజుకు 10 వేల టోకెన్లు, శ్రీవారి మెట్ల మార్గంలో 5 వేల టోకెన్లు కేటాయించింది.
భక్తుల రద్దీ ఆధారంగా టోకెన్ల కోటా పెంచే ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గతంలో కోవిడ్ కారణంగా దివ్యదర్శనం టోకెన్లు టీటీడీ నిలిపివేసింది. మూడేళ్ల తర్వాత తిరిగి దివ్యదర్శనం టోకెన్లు ప్రవేశపెట్టింది. అలాగే, తిరుమల శ్రీవారి హుండీకి కాసుల వర్షం కురుస్తోంది. మార్చి నెలలో కూడా హుండీ ఆదాయం భారీగానే వచ్చింది.
Tirumala: కాసుల వర్షం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే?
గతేడాది కాలం నుంచి శ్రీవారి హుండీ ఆదాయం ప్రతి నెల రూ.100 కోట్లకు పైగానే సమకూరుతోంది. ఈ నేపథ్యంలో మార్చి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.120.29 కోట్లు వచ్చింది. మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగిసింది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ టీటీడీ హుండీ ఆదాయం రూ.1,520.29 కోట్లు లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
మరోవైపు తిరుమలకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. గత కొన్ని నెలలుగా శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులను శ్రీవారికి సమర్పిస్తున్నారు. దీంతో ప్రతీ నెలా శ్రీవారి ఆదాయం పెరుగుతోంది.