TTD News: జనవరి 27 నుంచి అందుబాటులోకి టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు

కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేసిన 15 రకాలు పంచగవ్య గృహ ఉత్పత్తులను జనవరి 27వ తేదీ ప్రారంభిస్తున్నామని తెలిపారు

TTD News: జనవరి 27 నుంచి అందుబాటులోకి టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు

Ttd Panchagavya

TTD News: గోవు ఆధారిత పంచగవ్య ఉత్పత్తులను తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈమేరకు తిరుపతి డిపిడబ్ల్యు స్టోర్ లోని తయారీ ప్లాంట్ ను జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరబ్రహ్మయ్య సోమవారం పరిశీలించారు. అనంతరం జేఈఓ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ.. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేసిన 15 రకాలు పంచగవ్య గృహ ఉత్పత్తులను జనవరి 27వ తేదీ ప్రారంభిస్తున్నామని తెలిపారు. గో సంరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద పీట వేస్తోందన్నారు. ఇందులోభాగంగానే పంచగవ్య ఉత్పత్తుల తయారీకి టీటీడీ పూనుకుందని చెప్పారు.

Also read: Tirumala Visit: కోవిడ్ వాక్సినేషన్/నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే తిరుమల కొండపైకి అనుమతి

టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవోల ప్రత్యేక శ్రద్ధతో.. తక్కువ సమయంలోనే ఈ ఉత్పత్తుల తయారీ సాకారం అయ్యిందని జేఈఓ అన్నారు. దీంతో పాటు డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన చిత్ర పటాలు, ఇతర ఉత్పత్తుల విక్రయాలు కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కాగా టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించడానికి పలు ఆసుపత్రులతో ఎంఓయు కుదుర్చుకోనున్నట్లు జేఈఓ వీరబ్రహ్మం వివరించారు. ఈకార్యక్రమంలో చీఫ్ ఇంజినీరు నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, విజిఓ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Also read: Open Classrooms: బహిరంగ తరగతి గదులు సిద్ధం చేస్తున్న బెంగాల్ ప్రభుత్వం