TTD Wedding Halls: ఏపీలో కొత్తగా టీటీడీ కళ్యాణ మండపాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా పదహారు టీటీడీ కళ్యాణమండపాలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు.

TTD Wedding Halls: ఏపీలో కొత్తగా టీటీడీ కళ్యాణ మండపాలు

Yv Subba Reddy

TTD Wedding Halls: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా పదహారు టీటీడీ కళ్యాణమండపాలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో కళ్యాణమండపాల్లో పెళ్లిళ్లకు సాయం చేస్తూ సేవ చేస్తున్న టీటీడీ రాబోయే రోజుల్లో ఈ సేవలను మరింత విస్తృతం చెయ్యనున్నట్లు వెల్లడించారు సుబ్బారెడ్డి.

అలాగే, ఏడుకొండల్లోని అంజనాద్రి కొండలే హనుమ జన్మస్థలమని మనం నమ్ముతున్నామని, ఆంజనేయుడు జన్మస్థలంపై ఎలాంటి వివాదాలు రావొద్దు.. తేవొద్దన్నారు. రెండేళ్ల పాటు పాలకమండలి సేవలు అందించినట్లు చెప్పిన సుబ్బారెడ్డి, ఈ సేవ చేసే అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.

తిరుపతిలోని గరుడ వారధిని ఆలిపిరి వరకూ విస్తరిస్తామని, కరోనా ప్రభావం తగ్గిన తర్వాత తిరుమలకు అనుమతించే భక్తుల సంఖ్యను పెంచనున్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే కశ్మీర్‌లో నిర్మించాలని నిర్ణయించిన శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో 500 శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించగా.. వారణాసి, ముంబైలోనూ శ్రీవారి ఆలయాలను నిర్మించనున్నట్లు చెప్పారు. గుడికో గోమాత కార్యక్రమాన్ని విస్తరిస్తామని తెలిపారు.