Foreign Gold : విదేశీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు అరెస్టు

బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు క్యారియర్లతో పాటు ఒక రిసీవర్ ను పట్టుకుని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

Foreign Gold : విదేశీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు అరెస్టు

foreign gold

Updated On : June 10, 2023 / 5:50 PM IST

foreign gold seize : విదేశీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర అధికారులు వాహనాలు తనిఖీ చేశారు.

అధికారులకు అందిన సమాచారం మేరకు కారును తనిఖీ చేయగా సీటు కింద దాచిన 7.798 కిలోల విదేశీ బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు అనుమానితులను పోలీసులు విచారించారు.

Parthasarathy : వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు

వారు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ లో మరో డీఆర్ఐ బృందం తనిఖీలు చేపట్టింది. 2.471 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు క్యారియర్లతో పాటు ఒక రిసీవర్ ను పట్టుకుని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.