Jawan Sai Teja : సాయితేజ మృతదేహం కోసం ఎదురు చూపులు

ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలోచనిపోయిన వారి మృతదేహాలు గుర్తు పట్టని విధంగా ఉండడంతో.. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరగా సాయితేజ మృతదేహాన్ని తీసుకురావాలని...

Jawan Sai Teja : సాయితేజ మృతదేహం కోసం ఎదురు చూపులు

Sai

Jawan Sai Teja Dead body : ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయిన చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్‌ సాయితేజ అంత్యక్రియలు 2021, డిసెంబర్ 11వ తేదీ శనివారం జరిగే అవకాశముంది. శనివారం మధ్యాహ్నం లోపు సాయితేజ మృతదేహం ఆయన స్వగ్రామానికి చేరుకునే చాన్స్‌ ఉంది. డీఎన్‌ఏ టెస్టులు ఆలస్యం కావడంతో భౌతికకాయం తరలింపు కూడా ఆలస్యమవుతోంది. డీఎన్‌ఏ టెస్టుల కోసం ఇప్పటికే సాయితేజ బ్లడ్‌ శాంపిల్స్‌ను ఆర్మీ అధికారులు సేకరించారు.

Read More : Jr NTR – Puneeth- RRR : భావోద్వేగంతో పునీత్ పాట చివరిసారి పాడిన ఎన్టీఆర్

ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలోచనిపోయిన వారి మృతదేహాలు గుర్తు పట్టని విధంగా ఉండడంతో.. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆర్మీ బృందం సాయితేజ ఇంటికి వచ్చి ఆయన తల్లిదండ్రులు, పిల్లల నుంచి రక్త నమూనాలను సేకరించి తీసుకెళ్లారు. అవసరమైతే ఢిల్లీకి కుటుంబ సభ్యులను రావాల్సి ఉంటుందని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు సూచించారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేయాలంటే మరో రోజు సమయం పట్టే అవకాశముంది.

Read More : Bipin Rawat Funerals : సైనిక లాంఛనాలతో బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి

సాయితేజ మృతదేహం కోసం కుటుంబ సభ్యులు మూడు రోజులుగా ఎదురు చూస్తున్నారు. అయితే సాయితేజ చేతిపై టాటూలు ఉన్నాయని.. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులకు చెప్పినట్లు ఆయన సోదరుడు మహేశ్‌ తెలిపారు. శరీరంపైనున్న గుర్తుల ఆనవాళ్లకు సంబంధించిన క్లోజ్‌ అప్‌ ఫోటోల ద్వారా తెలియ పరిస్తే.. గుర్తు పట్టగలమని మహేశ్‌ ఆర్మీ అధికారులకు చెప్పారు. త్వరగా సాయితేజ మృతదేహాన్ని తీసుకురావాలని కోరారాయన.