Telugu states : కరోనా కల్లోలం, లాక్ డౌన్ పై తెలుగు రాష్ట్రాల నిర్ణయం ఏమిటో

Telugu states : కరోనా కల్లోలం, లాక్ డౌన్ పై తెలుగు రాష్ట్రాల నిర్ణయం ఏమిటో

Corona telugu states

Lockdown : తెలుగు రాష్ట్రాలు కరోనాతో విలవిలలాడుతున్నాయి. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. అదే క్రమంలో మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వైరస్ అధికంగా ఉంటుడడంతో మినీ లాక్ డౌన్, రాత్ర వేళ కర్ఫ్యూ విధిస్తున్నాయి. కానీ అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.

ఢిల్లీ తరహాలో కర్నాటక కూడా లాక్‌డౌన్ విధించడంతో ఇప్పుడు అందరి దృష్టి తెలుగు రాష్ట్రాలపై పడింది. కరోనా సెకండ్ వేవ్‌ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా ఎక్కువగానే ఉంది. ఏపీలో రోజూ 10 వేలకు పైగా కేసులు, తెలంగాణలో 7వేల కేసులు నమోదవుతున్నాయి. రెండు రాష్ట్రాలూ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడంలేదు.

మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలివ్వడం.. స్కూళ్ల మూసివేత వంటి ఆంక్షలు అమలు చేస్తున్నా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. దీంతో ఏపీ, తెలంగాణల్లోనూ లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆర్థిక భారం పడకుండా.. ప్రజలకు నష్టం జరగకుండా లాక్‌డౌన్ విధించేలా రెండు తెలుగు రాష్ట్రాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మే 2 తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు కర్నాటక ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. 2021, ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం నుంచి 14 రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. అత్యసవర సర్వీసులకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. నిత్యావసరాల దుకాణాలు ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు.

గడచిన 24 గంటల్లో 34వేల 804 కేసులు నమోదయ్యాయి. 143 మంది చనిపోయారు. వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ…కరోనా ఉధృతి తగ్గకపోవడంతో లాక్‌డౌన్ విధించాలని కర్నాటక నిర్ణయించింది. మరోవైపు ఇటీవలే ఎన్నికలు పూర్తిచేసుకున్న కేరళ మాత్రం పూర్తిస్థాయి లాక్‌డౌన్ వైపు మొగ్గుచూపడం లేదు. వారాంతాల్లో మాత్రమే లాక్‌డౌన్ అమలు చేస్తోంది. కరోనా కేసులు ఉధృతంగా ఉన్న మహారాష్ట్ర కొన్ని రోజులుగా లాక్‌డౌన్ తరహా ఆంక్షలు అమలు చేస్తోంది.

Read More : Odisha To Telangana : హైదరాబాద్ కు ఆక్సిజన్ ట్యాంకర్లు