Chiranjeevi : రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డికి బదులు చిరంజీవి సీఎం కావాలి, కానీ .. అందుకే కాలేదు : చింతా మోహన్

రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డికి బదులు  చిరంజీవి సీఎం కావాలి అంటూ మాజీ కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chiranjeevi :  రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డికి బదులు చిరంజీవి సీఎం కావాలి, కానీ .. అందుకే కాలేదు : చింతా మోహన్

Chinta Mohan..chiranjeevi

chinta mohan  : రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డికి బదులు  చిరంజీవి సీఎం కావాలి అంటూ మాజీ కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ పాలన గురించి, ఏపీ రాజకీయ పరిస్థితులు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాలన గురించి చింతా మోహన్ వ్యాఖ్యానిస్తు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా విమర్శలు చేశారు. అలాగే రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డికి బదులు చిరంజీవి ముఖ్యమంత్రి కావాల్సినవాడు కానీ రాజకీయ అనుభవం లేక ముఖ్యమంత్రి కాలేదు అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కూడా అన్న చిరంజీవిలా అయోమయంగా ఉన్నారని అటువంటి రాజకీయాలు పనిచేయవన్నారు. చిరంజీవి రాజకీయం తెలీదనీ అలాగే వవన్ కూడా తెలియదని అన్నారు.

రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డికి బదులు  చిరంజీవి ముఖ్యమంత్రి కావలసిన వ్యక్తి ..కానీ రాజకీయ అనుభవం లేక ముఖ్యమంత్రి కాలేదని..కానీ నాకు చిరంజీవి మంచి మిత్రుడు అంటూ చెప్పుకొచ్చారు. పార్టీ వీడిన వారిని వెనక్కి పిలవనని వస్తే కాదను అని అన్నారు. గిడుగు రుద్ర రాజును పీసీసీగా అధిష్టానం నిర్ణయించిందని తెలిపారు. అలాగే చింతా తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి గతంలో జరిగిన పొత్తుల గురించి చెప్పుకొస్తు కేసీఆర్ కి రాజశేఖర్ రెడ్డి హయాంలో పొత్తులో భాగంగా సీట్లు ఇప్పించింది నేనేనని ఈ సందర్భంగా చింతా మోహన్ గుర్తు చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ గురించి మాట్లాడనని అన్నారు.

Andhra Pradesh : పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభోత్సవం చేయాలి కానీ.. ప్రధాని మోదీ చేస్తున్నారు : చింతా మోహన్

కాగా మెగాస్టార్‌ చిరంజీవిగా పేరొందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 18 సీట్లు మాత్రమే సాధించి..ఆ తరువాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినవిషయం తెలిసిందే. ఆ తరువాత చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖా మంత్రిగా పనిచేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చిరంజీవి 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా పర్యాటక శాఖా మంత్రి గా పనిచేశారు. ఆ తరువాత రాజకీయాల్లో యాక్టివ్ గా లేకుండా సినిమాలపై ఫోకస్ పెట్టి సినిమాలతో బిజి బిజీగా గడుపుతున్నారు. సినిమాల్లోకి చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చినా మెగాస్టార్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్నారు.

కాగా..దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత కొణిజేటి రోశయ్యను కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంగా నియమించింది.ఆ తరువాత పలు కీలక పరిణామాలతో నల్లారి కిరణ్ కుమార్ లు సీఎంగా నియమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నల్లారి కిరణ్ కుమార్ ఆఖరి సీఎంగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.