Andhra Pradesh : పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభోత్సవం చేయాలి కానీ.. ప్రధాని మోదీ చేస్తున్నారు : చింతా మోహన్

కేంద్రంలో బీజేపీ పాలన..ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన గురించి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో దారుణం, ఏపీలో శూన్యం అంటూ సెటైర్లు వేశారు.

Andhra Pradesh : పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభోత్సవం చేయాలి కానీ.. ప్రధాని మోదీ చేస్తున్నారు : చింతా మోహన్

congress leader chinta mohan

congress leader chinta mohan : బీజేపీ పాలనలో దేశ పరిస్థితులు అస్సలేమీ బాగాలేవు అంటూ మాజీ కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ విమర్శించారు. పార్లమెంట్ భవనాన్ని మార్చాల్సిన అవసరం లేకపోయినా మారుస్తున్నారని రాష్ట్రపతి చేయాల్సిన ప్రారంభోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నారు అంటూ విమర్శలు సంధించారు. పేదలను బ్యాంకులు పట్టించుకోవడం లేదని కానీ కార్పొరేట్లకు మాత్రమే రుణాలు దండిగా ఇస్తున్నారని బీజేపీ ప్రభుత్వంలో జరిగేది ఇటువంటివేనంటూ ఆరోపించారు. ఈ సందర్బంగా చింతా మోహన్ ఏపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు. ఏపీలో పాలన అసహ్యంగా తయారవుతోందని..జగన్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు చేసింది శూన్యం అంటూ ఎద్దేవా చేశారు.

ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఆపేశారని వారికి చదువుకునే హక్కును దూరం చేసిన ఘనత సీఎం జగన్ ప్రభుత్వానిదేనన్నారు. ఏపీలో ఉద్యోగాలేలేవని..చదువుకున్నవారు వేరే ప్రాంతాలకు వలసపోతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ తిరిగి అధికారంలోకి రాడు అంటూ చెప్పుకొచ్చారు. రాడు రాలేడు అని అన్నారు. ఇక ఫ్యాన్ పని అయిపోయింది జగన్ పని కూడా అయిపోయిందన్నారు.

ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ లకి నిధులు లేవని కేవలం కేటాయింపులు మాటల్లోనే తప్ప చేతల్లో శూన్యం అంటూ విమర్శించారు. ఎస్సిలు,ఎస్టీలు ఇబ్బందులు పడుతున్నారుని అన్నారు. ఏపీలో రెండు సామాజిక వర్గాలు 70,75 ఏళ్లుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. 2024 లో ఏపీలో,ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చింతా మోహన్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే కాపులకు రెండున్నర,ఓబీసీ ఎస్సిలకు రెండున్నారేళ్లు సీఎం పదవి ఇస్తాం అంటూ హామీ ఇచ్చారు.ఏపీలో సంక్షేమం అసలు ఎవరికి వెళ్తుందో తెలీకుండా ఉందన్నారు. ఏపీలో ఫ్యాన్ పరిస్థితి ,సైకిల్ పరిస్థితి చూసి నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఏపీలో 120 స్థానాలకు తక్కువ కాకుండా కాంగ్రెస్ గెలుస్తుంది అంటూ ఆశాభావం వ్యక్తంచేశారు.