YCP : ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం

టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అంబటి అన్నారు. ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

YCP : ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం

Ambati

YCP leaders fire : టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్‌పై బురద చల్లాలని చూస్తే.. మీరే దెబ్బతింటారని టీడీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు.

చంద్రబాబును ప్రథమ ముద్దాయిగా చూడాలని కన్నబాబు అన్నారు. ముందు తప్పు వాళ్లే చేశారు.. దాడులు కేవలం రియాక్షన్‌ మాత్రమే అని తెలిపారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తండ్రీ, కొడుకు పేయిడ్‌ ఆర్టిస్టులను పెట్టించి తిట్టిస్తున్నారని ఆరోపించారు.

Chandrababu : టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు 36 గంటలపాటు దీక్ష

టీడీపీ తీరుపై మంత్రి అనిల్ కుమార్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎంపై కావాలనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలను ఎవరూ టచ్ చేయలేరని.. సీఎం జగన్‌పై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయకూడదన్నారు.